Site icon NTV Telugu

Goa: గోవాలో నేపాల్ మేయర్ కుమార్తె మిస్సింగ్.. జరిగిందిదే..!

Miss

Miss

గోవాలో నేపాల్ మేయర్ కుమార్తె ఆర్తి హమాల్ మిస్సింగ్ తీవ్ర కలకలం రేపింది. గత సోమవారం నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టాలంటూ ఆర్తి హమాల్ తండ్రి గోపాల్ మహల్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఎట్టకేలకు ఆమె ఆచూకీని కనిపెట్టారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

36 ఏళ్ల ఆర్తి మహల్ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటోంది. ఓషో ధ్యాన కేంద్రంలో ఉంటోంది. అయితే సోమవారం రాత్రి నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తండ్రి గోపాల్ మహల్ కంగారు పడ్డారు. తమ కుమార్తె వివరాలు కనిపెట్టాలని గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం జల్లెడ పడ్డారు. ఆర్తి తప్పిన ప్రాంతం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఆమెను కనుగొన్నారు. నార్త్‌ గోవాలోని మాండ్రేమ్‌లో ఓ హెటల్‌లో కనిపించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఆర్తి తండ్రికి పోలీసులు సమాచారం చేరవేశారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: Inspector Rishi: దెయ్యం రోజూ నా బెడ్ రూమ్ కొచ్చేది.. నవీన్ చంద్ర షాకింగ్ కామెంట్స్

గోపాల్ హమాల్ నేపాల్‌లోని ధంగాడి సబ్ మెట్రోపాలిటన్ నగర మేయర్‌గా ఉన్నారు. తన కూతురును కనిపెట్టడంలో సాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఆర్తి కనిపించకుండా పోయిన విషయాన్ని ఆమె స్నేహితుడు తమకు సమాచారం అందించారని ఆయన తెలిపారు. తన చిన్న కుమార్తె అర్జూ, అల్లుడు కలిసి తమ ఆర్తిని వెతుక్కుంటూ గోవా వెళ్తున్నారని తెలిపారు. మొత్తానికి మూడ్రోజుల తర్వాత ఆర్తి ఆచూకీ లభించడంతో కథ సుఖాంతమైంది.

ఇది కూడా చదవండి: Pithani Balakrishna: వైసీపీలోకి జనసేన ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ?

Exit mobile version