ఫస్ట్ లుక్ పోస్టర్ల ద్వారా ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ‘నేను స్టూడెంట్ సర్!’ నిర్మాతలు తమ సినిమా టీజర్ రిలీజ్ తేదీని వీడియో రూపంలో తెలియచేశారు. యస్.వి.2 ఎంటర్‌టైన్‌మెంట్ పై ‘నాంది’ సినిమా తీసిన సతీష్ వర్మ ఈ సినిమాను బెల్లంకొండ గణేశ్ హీరోగా రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో తీశారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Also Read : The Vaccine War : ఈ సారి ‘ద వాక్సిన్ వార్’ అంటున్న ‘ద కాశ్మీర్ ఫైల్స్’ గ్యాంగ్
ఈ చిత్రానికి కథను దర్శకుడు కృష్ణ చైతన్య అందించటం విశేషం. సముతిర ఖని కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో గణేష్ సరసన అవంతిక దాసాని హీరోయిన్. సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించే ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని, అనిత్ మధాడి సినిమాటోగ్రఫీ, ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాశారు.
