Jailer 2 : మామ అల్లుళ్లను కలుపుతున్న జైలర్ 2 డైరెక్టర్

New Project 2024 10 22t124307.139

New Project 2024 10 22t124307.139

Jailer 2 : ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమతం అవుతన్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో మంచి కంబ్యాక్ అందించి డైరెక్టర్. ‘జైలర్’ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెల్సన్ పాపులర్ అయ్యాడు. ‘జైలర్’ మెగా బాక్సాఫీస్ విజయాన్ని అందించడంతో ‘ జైలర్ 2 ‘ కోసం సన్నాహాలు మొదలు పెట్టాడు. సీక్వెల్‌లో పని చేస్తున్నట్లు అనేకసార్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం రజనీకాంత్ తో పాటు ధనుష్‌ని తీసుకురావడానికి నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఒకే సినిమా కోసం మామ అల్లుళ్లను క‌లిపే వ్యూహాన్ని నెల్సన్ అనుస‌రిస్తున్నాడ‌ట‌. ‘జైలర్’లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌ల లాంటి దిగ్గజాలు గెస్ట్ రోల్స్ పోషించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ సీక్వెల్ లోను వారిని న‌టింప‌జేయాల‌ని అనుకుంటున్నారట. వారితో పాటు ధనుష్ కోసం ఒక పాత్రను సిద్ధం చేశార‌ని తెలిసింది. ఇప్పటికే ధ‌నుష్ ఎంపిక విష‌య‌మై రజనీకాంత్ నుండి అనుమతి పొందినట్లు క‌థ‌నాలొస్తున్నాయి.

Read Also:AlluArjun : మతి పోగొడుతున్న పుష్ప -2 ప్రీ రిలీజ్ బిజినెస్..?

నిజజీవితంలో మామా అల్లుళ్లు అయిన‌ రజనీకాంత్ -ధనుష్ ని ఒకే ఫ్రేమ్ లో వెండితెర మీద వీక్షించేందుకు అభిమానులు ఆస‌క్తిగా ఉన్నారు. అయితే ధనుష్ తన బిజీ షెడ్యూళ్ల మధ్య ‘జైలర్ 2’ షూటింగ్ కోసం డేట్ ఇస్తాడో లేదో చూడాలి. ధనుష్ అల్లుడు అయినప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి వీరాభిమాని. ఇటీవల చెన్నైలోని ఓ థియేటర్‌లో ఇటీవల అభిమానులతో కలిసి ‘వెట్టయన్’ సినిమాను వీక్షించి ఆనందం వెలిబుచ్చాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ‘జైలర్ 2’ ముహూర్తపు పూజకు ఆహ్వానించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుక‌లో మాజీ భర్త ధనుష్‌తో ఐశ్చర్య క‌లుస్తార‌ని కూడా అనుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ ‘కూలీ’ పూర్తి చేసిన తర్వాత ‘జైలర్ 2’ సెట్స్ పైకి వెళుతుంద‌ని సమాచారం. కొన్ని వారాల క్రితమే రజనీకాంత్‌కి శస్త్ర చికిత్స జరగడంతో ‘కూలీ’ షూటింగ్ ఆగిపోయింది. త్వరలో ఆయన పనిని తిరిగి మొదలు పెట్టే అవకాశం ఉంది. కూలీ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి ర‌జ‌నీ త‌దుప‌రి జైల‌ర్ 2లో న‌టించే అవ‌కాశం ఉంది.

Read Also:Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్‌.. 83 వేల ఫోన్ 43 వేలకే! బ్యాంకు ఆఫర్స్ అదనం