Jailer 2 : మామ అల్లుళ్లను కలుపుతున్న జైలర్ 2 డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2 : ప్రముఖ తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమతం అవుతన్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో మంచి కంబ్యాక్ అందించి డైరెక్టర్. ‘జైలర్’ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెల్సన్ పాపులర్ అయ్యాడు. ‘జైలర్’ మెగా బాక్సాఫీస్ విజయాన్ని అందించడంతో ‘ జైలర్ 2 ‘ కోసం సన్నాహాలు మొదలు పెట్టాడు. సీక్వెల్‌లో పని చేస్తున్నట్లు అనేకసార్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం రజనీకాంత్ తో పాటు ధనుష్‌ని తీసుకురావడానికి నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు. ఒకే సినిమా కోసం మామ అల్లుళ్లను కలిపే వ్యూహాన్ని నెల్సన్ అనుసరిస్తున్నాడట. ‘జైలర్’లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్‌ల లాంటి దిగ్గజాలు గెస్ట్ రోల్స్ పోషించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ సీక్వెల్ లోను వారిని నటింపజేయాలని అనుకుంటున్నారట. వారితో పాటు ధనుష్ కోసం ఒక పాత్రను సిద్ధం చేశారని తెలిసింది. ఇప్పటికే ధనుష్ ఎంపిక విషయమై రజనీకాంత్ నుండి అనుమతి పొందినట్లు కథనాలొస్తున్నాయి.
Read Also:AlluArjun : మతి పోగొడుతున్న పుష్ప -2 ప్రీ రిలీజ్ బిజినెస్..?
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
నిజజీవితంలో మామా అల్లుళ్లు అయిన రజనీకాంత్ -ధనుష్ ని ఒకే ఫ్రేమ్ లో వెండితెర మీద వీక్షించేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే ధనుష్ తన బిజీ షెడ్యూళ్ల మధ్య ‘జైలర్ 2’ షూటింగ్ కోసం డేట్ ఇస్తాడో లేదో చూడాలి. ధనుష్ అల్లుడు అయినప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి వీరాభిమాని. ఇటీవల చెన్నైలోని ఓ థియేటర్‌లో ఇటీవల అభిమానులతో కలిసి ‘వెట్టయన్’ సినిమాను వీక్షించి ఆనందం వెలిబుచ్చాడు. నెల్సన్ దిలీప్‌కుమార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ‘జైలర్ 2’ ముహూర్తపు పూజకు ఆహ్వానించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో మాజీ భర్త ధనుష్‌తో ఐశ్చర్య కలుస్తారని కూడా అనుకుంటున్నారు. లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ ‘కూలీ’ పూర్తి చేసిన తర్వాత ‘జైలర్ 2’ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. కొన్ని వారాల క్రితమే రజనీకాంత్‌కి శస్త్ర చికిత్స జరగడంతో ‘కూలీ’ షూటింగ్ ఆగిపోయింది. త్వరలో ఆయన పనిని తిరిగి మొదలు పెట్టే అవకాశం ఉంది. కూలీ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి రజనీ తదుపరి జైలర్ 2లో నటించే అవకాశం ఉంది.
Read Also:Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్.. 83 వేల ఫోన్ 43 వేలకే! బ్యాంకు ఆఫర్స్ అదనం
తాజావార్తలు
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!