Rowdy Sheeter Srikanth: రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది.. ఇక, ఆస్పత్రికి శ్రీకాంత్‌ను తీసుకొచ్చిన సమయంలో అతడి ప్రియురాలు అరుణతో సన్నిహితంగా ఉన్నర వీడియో వైరల్ కావడం కలకలం రేపింది.. ఈ వ్యవహారంలో జైలు అధికారులు, ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.. అయితే విశాఖ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్న శ్రీకాంత్ కు మెమో జారీ చేశారు నెల్లూరు జైలు సూపరిండెంటెంట్ … పెరోల్ రద్దుచేసి ఈ నెల 23వ తేదీన విశాఖ సెంట్రల్ జైలుకు శ్రీకాంత్ ను తరలించారు అధికారులు.. అయితే, పెరోల్ రాక ముందు శ్రీకాంత్ ను నెల్లూరు జైలు అధికారులు వైద్యం కోసం హాస్పిటల్ కి తరలించారు.. హాస్పిటల్‌లో అతని ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది… ఈ వీడియోపై వివరణ కోరుతూ నెల్లూరు సూపరింటెండెంట్ విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీకాంత్ కు మెమో పంపించారు.. అయితే, నెల్లూరు జైలు అధికారి ఇచ్చిన మెమోపై వివరణ ఇచ్చేందుకు టైం కోరాడ శ్రీకాంత్.. కాగా, శ్రీకాంత్ వివరణ ఇచ్చిన తర్వాత పరిశీలించి.. చర్యలు తీసుకుంటామని జైలు అధికారులు చెబుతున్నారు..
Read Also: DELHI DRUGS: ఢిల్లీ, హైదరాబాద్‌లో భారీగా కొకైన్ కలకలం
