NTV Telugu Site icon

Anil Kumar: అనిల్ వర్సెస్ నారాయణ.. కాక పుట్టిస్తున్న నెల్లూరు రాజకీయం

Anil Vs Narayana

Anil Vs Narayana

మాజీ మంత్రి నారాయణ పై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నా.. దమ్ముంటే జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి కాదు.. నేనే పోటీ చేస్తానని మాజీ మంత్రి నారాయణ ప్రకటించాలని అన్నారు. కనిగిరి, కందుకూరు, వెంకటగిరి లేదా నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు.. అంటే నాకు అంత సత్తా ఉందని గుర్తించాలని అనిల్ అన్నారు. మీ లాగా పక్క నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థిని కాను.. మళ్లీ నారాయణను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: Delhi High Court: భర్తపై అలాంటి ఆరోపణలు చేయడం భార్య క్రూరత్వానికి పరాకాష్ట..

ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు రూ.50 లక్షల డబ్బు పంపించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు అనిల్ కుమార్.. పంపలేదని ధైర్యంగా చెప్పాలి.. తాను ఆ డబ్బులను తిరిగి పంపించానన్నారు. నారాయణ నేరుగా టికెట్ తెచ్చుకోలేక ఇద్దరికి రూ. 50 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. టీడీపీలోని ముఖ్య నేతలే ఈ మాట అంటున్నారని అనిల్ తెలిపారు. అంతేకాకుండా.. నారాయణకు మనుషుల్లేక ఎన్ టీం పేరుతో జీతాలు ఇచ్చి తిప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. నీ కోసం పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలు ఎవరున్నారని నారాయణపై విమర్శనాస్త్రాలు సంధించారు అనిల్ కుమార్.

Read Also: Minister Amarnath: పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే మంచిది..

Show comments