NTV Telugu Site icon

Neha Shetty : ట్రెడిషనల్ వేర్ లో అదరగొడుతున్న రాధిక..

Whatsapp Image 2023 09 18 At 11.12.22 Pm

Whatsapp Image 2023 09 18 At 11.12.22 Pm

నేహా శెట్టి ఈ భామ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.డీజే టిల్లు’సినిమాతో నేహా శెట్టి టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాకు ముందు ఈ భామ ‘మెహబూబా’, ‘గల్లీ’ బాయ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.కానీ ఆ చిత్రాలు ఈ భామకు బ్రేక్ ఇవ్వలేదు.ఈ భామ టాలీవుడ్ లో అడుగుపెట్టిన దాదాపు ఐదేళ్ళకు డీజే టిల్లు సినిమాతో హిట్ అందుకుంది. ఆ సినిమాలో ఈ భామ చేసిన రాధిక పాత్ర ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. రాధిక గా మెప్పించిన నేహా శెట్టి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.. డిజే టిల్లు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ భామ వరుస ఆఫర్స్ అందుకుంది..రీసెంట్ గా ఈ భామ ‘బెదురులంక 2012’ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది.

ఇక ఈ భామ మరో రెండు ప్రాజెక్ట్స్ తో అలరించేందుకు సిద్ధమవుతోంది.నేహా శెట్టి వరుస సినిమాలతో బిజీ గా వున్నా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. తన హాట్ అందాల విందుతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నేడు గణేశ్ చతుర్థి సందర్భంగా నేహా శెట్టి సంప్రదాయ దుస్తుల్లో పద్ధతిగా మెరిసింది. ఫెస్టివల్ లుక్ అంటూ ఆ ఫొటోలను అభిమానులకు షేర్ చేసింది . బ్యూటీఫుల్ స్టిల్స్ తో ఆకట్టుకుంది.స్టన్నింగ్ లుక్స్ తో మైమరిపించింది. అలాగే ఈ భామ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలిపింది.నేహా శెట్టి ప్రస్తుతం మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’లో నటించింది. రూల్స్ రంజన్ సినిమా ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది కానీ కొన్ని అనుకోని కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది.

Show comments