భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్ 2025లో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. తొలిసారి 90 మీటర్ల మార్కును దాటేశాడు. దోహా డైమండ్ లీగ్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ రెండవ స్థానంలో నిలిచాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ 90.23 మీటర్లు త్రో చేసి తన అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 91.06 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. వెబర్ ఈ త్రోను ఆరో ప్రయత్నంలో చేశాడు. నీరజ్ తో పాటు, పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ లో పాల్గొన్న భారత్ కు చెందిన కిషోర్ జెనా ఎనిమిదో స్థానంలో నిలిచాడు.
Also Read:Off The Record: కుప్పంలో వైసీపీ పరిస్థితి ఏంటి? మీసాలు మెలేసినోళ్లంతా ఇప్పుడు ఏంచేస్తున్నారు..?
డైమండ్ లీగ్ ఒక దశలో మొదటి స్థానాన్ని సంపాదించినందుకు ఒక అథ్లెట్ 8 పాయింట్లు పొందుతాడన్న విషయం తెలిసిందే. రెండవ స్థానం సాధించినందుకు 7 పాయింట్లు, మూడవ స్థానం సాధించినందుకు 6 పాయింట్లు, నాల్గవ స్థానం సాధించినందుకు 5 పాయింట్లు వస్తాయి. అంటే నీరజ్ చోప్రాకు 7 పాయింట్లు రాగా, వెబర్ కు 8 పాయింట్లు వచ్చాయి. డైమండ్ లీగ్ 2025 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జ్యూరిచ్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్‌తో ముగుస్తుంది. డైమండ్ లీగ్ ఫైనల్ విజేత డైమండ్ ట్రోఫీని అందుకుంటాడు.
దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా తొలి ప్రయత్నం అద్భుతంగా ఉంది. అతను 88.44 మీటర్లు విసిరాడు. నీరజ్ రెండవ ప్రయత్నం ఫౌల్. నీరజ్ మూడో ప్రయత్నం 90.23 మీటర్లు. తన కెరీర్‌లో తొలిసారిగా నీరజ్ 90 మీటర్ల మార్కును దాటాడు. భారతీయ ఆటగాడు 90 మీటర్ల ఇన్నింగ్స్ ఆడటం ఇదే మొదటిసారి. దీనికి ముందు, నీరజ్ చోప్రా అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 89.94 మీటర్లు. అంటే నీరజ్ జావెలిన్ త్రోలో జాతీయ రికార్డు సృష్టించాడు.
Also Read:Niharika : అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ చేయాలని ఉంది.. మహేశ్ తో అలాంటి మూవీ..
నీరజ్ చోప్రా నాల్గవ త్రో లో 80.56 మీటర్ల దూరం త్రో చేశాడు. నీరజ్ ఐదవ ప్రయత్నం ఫౌల్. కాగా ఆరో ప్రయత్నంలో 88.20 మీటర్ల దూరం సాధించాడు. దోహా డైమండ్ లీగ్‌లో, నీరజ్ చోప్రా ఆండర్సన్ పీటర్స్ (గ్రెనడా), జాకుబ్ వాడ్లెచ్ (చెక్ రిపబ్లిక్), జూలియన్ వెబర్, మాక్స్ డెహ్నింగ్ (ఇద్దరూ జర్మనీ), జూలియస్ యెగో (కెన్యా), రోడెరిక్ డీన్ (జపాన్) వంటి ఆటగాళ్ల నుంచి పోటీని ఎదుర్కొన్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ దోహా డైమండ్ లీగ్‌లో పాల్గొనలేదు.
Massive throw. NATIONAL RECORD
90.23m#DohaDL @Neeraj_chopra1 pic.twitter.com/xskI1wGM41— Athletics Federation of India (@afiindia) May 16, 2025
