NTV Telugu Site icon

Neeraj Chopra: భారత్కు మరో పసిడి.. స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా

Neeraj Chopra

Neeraj Chopra

Neeraj Chopra: ఆసియా గేమ్స్ లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చూపిస్తున్నారు. ఇప్పటికే 17 బంగారు పతకాలను సాధించగా.. భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. దీంతో భారత్ 18 బంగారు పతకాలు సాధించింది. జావెలిన్ త్రోలో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఈ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తాను మరోసారి అద్భుత ప్రదర్శన చేసి.. టీమిండియాకు బంగారు పతకాన్ని అందించాడు. ఫైనల్ లో మరో భారత జావెలిన్ త్రోయర్ కిశోర్ కుమార్ జెనాతో నీరజ్ తలపడ్డాడు. వీరిద్దరి మధ్య ఉత్కంఠ పోరు సాగింది. కిషోర్ కుమార్ జెనా రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకున్నాడు.

Read Also: Bombay High: మహారాష్ట్ర మరణాలపై బాంబే హైకోర్టు సీరియస్.. రేపు అత్యవసర విచారణ

నీరజ్ తొలి ప్రయత్నంలో 82.38 మీటర్లు విసిరాడు. రెండో త్రోలో 84.49 మీటర్ల దూరం విసిరాడు. నాలుగో ప్రయత్నంలో 88.88 మీటర్ల దూరం విసిరాడు. ఐదో స్థానంలో 80.80 మీటర్ల దూరం విసిరాడు. అయితే కిషోర్ జెనా కూడా నాల్గవ ప్రయత్నంలో బాగా విసిరాడు. అతను 87.54 మీటర్ల దూరం విసిరాడు. దీంతో నీరజ్ బంగారు పతకం, కిషోర్ రజత పతకం సాధించారు.

Read Also: Mercury: కుచించుకుపోతున్న బుధ గ్రహం.. తగ్గిన వ్యాసార్థం.. కారణం ఇదే..