NTV Telugu Site icon

Neeraj Chopra: ఒక్క సెంటి మీటర్ దూరంతో డైమండ్ లీగ్‌ను కోల్పోయిన నీరజ్ చోప్రా..

Neeraj Chopra

Neeraj Chopra

Neeraj Chopra Diamond League Final: బ్రసెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్‌లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో 87.86 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. మూడో ప్రయత్నంలో అత్యుత్తమ త్రో చేశాడు. అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో ఉండగా, పారిస్ ఒలింపిక్స్ 2024 రజత పతక విజేత నీరజ్ కేవలం 0.01 మీటర్ల తేడాతో టాప్ ప్రైజ్‌ను కోల్పోయాడు. నీరజ్ కేవలం 1 సెంటీమీటర్ తేడాతో టైటిల్ గెలవలేకపోయాడు.

Breaking News: కోల్‌కతా అత్యాచారం కేసులో ఆర్‌జీకర్ మాజీ ప్రిన్సిపాల్, పోలీస్ అధికారి అరెస్ట్

నీరజ్ చోప్రా తన ఆరో, చివరి ప్రయత్నంలో 86.46 మీటర్ల త్రో విసిరాడు. దీంతో డైమండ్ లీగ్ గెలవడంలో విఫలమయ్యారు. దింతో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. నంబర్ వన్ స్థానంలో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల త్రోతో టైటిల్ గెలుచుకున్నాడు. ఈ పోటీలలో మొదటి స్థానంలో నిలిచిన పీటర్స్‌కు 30 వేల డాలర్లు ప్రైజ్ మనీ లభించగా.. దానితోపాటు అతనికి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ కు నేరుగా అర్హత సాధించాడు. ఇక రెండో స్థానంతో సరిపెట్టుకున్ననీరాజ్ చోప్రాకు 12 వేల డాలర్ల నగదు బహుమతి గెలుచుకున్నాడు. అయితే., నీరజ్ గత కొన్ని రోజులుగా గజ్జల్లోని కండ‌రాల స‌మ‌స్య‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే.

Show comments