NTV Telugu Site icon

Neena Gupta: అతడితో లిప్ లాక్.. నోరును డెటాల్ తో కడుక్కున్నా

Neena

Neena

Neena Gupta: బాలీవుడ్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదా అందుకున్న ఈమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో తల్లిగా, బామ్మగా నటిస్తూ మంచి గుర్తింపునే అందుకుంటుంది.ఇక ప్రస్తుతం నీనా గుప్తా లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో నటించిన విషయం తెల్సిందే. తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, విజయ్ వర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ రేపటినుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ ల నీనా గుప్తా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడమే కాకుండా ఘాటు విషయాలను కూడా చెప్పుకొచ్చింది. తన చిన్నతనంలో ముద్దు పెట్టుకుంటేనే ప్రెగ్నెంట్ అయిపోతారని భయపడేదాన్ని అని, కానీ, ఈ జనరేషన్ అలా లేదని చెప్పుకొచ్చింది. శృంగారం గురించి, బూతు డైలాగ్స్ గురించి చెప్పాలి. అప్పుడే వారు సరైన మార్గంలో పెరుగుతారని చెప్పుకొచ్చింది. ఇక తాజాగా మరో ఇంటర్వ్యూలో ఆమె తన మొదటి పెదవి ముద్దు గురించి ఓపెన్ అయ్యింది.

Tharun Bhaskar: ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తరుణ్ భాస్కర్…

” చాలా ఏళ్ళ క్రితం ఒక సీరియల్ లో నటించాను. అందులో దిలీప్ ధావన్ తో ఒక కిస్ సీన్ ఉంది. చరిత్రలో అదే మొదటిసారి అనుకుంటా.. సీరియల్ లో అతడికి లిప్ కిస్ పెట్టాను. చూడడానికి అతడు బాగానే ఉంటాడు. కానీ, ఆ సీన్ చేయడానికి నేను సిద్ధంగా లేను. చాలా టెన్షన్ పడ్డాను. కానీ, నాకు నేను దైర్యం చెప్పుకొని ఆ సీన్ ను పూర్తిచేశాను. ప్రతి ఒక్కరు అన్ని చేయలేరు.. కొంతమంది కామెడీ చేయలేరు.. మరికొంతమంది డ్యాన్స్ చేయలేరు.. అని ధైర్యం చెప్పుకొని ముద్దు పెట్టాశాను.. ఆ తరువాత మాత్రం నా నోరును డెటాల్ తో క్లీన్ చేసుకున్నాను. తెలియని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం చాలా కష్టమైన పని” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments