Site icon NTV Telugu

Neelam Madhu : 16న కొత్తపల్లిలో బీఆర్ఎస్‌కు రాజీనామా చేస్తా

Neelam Madhu

Neelam Madhu

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత నీలం మధు ముదిరాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్నారు. కార్యకర్తల అభిప్రాయాలు, అభిష్టం మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు నీలం మధు. దుర్గాదేవి పండుగ సందర్భంగా ఈ నెల 16న తేదీ నుంచి మీ బిడ్డనై ఇంటింటికీ వస్తున్నా అని ఆయన వెల్లడించారు. 16 తేదీన కొత్తపల్లిలో బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. ఏ పార్టీ అవకాశం ఇచ్చినా ఆ కండువా కప్పుకుని బరిలో దిగుతా అని ఆయన స్పష్టం చేశారు.

Also Read : Visakhapatnam: అప్పికొండ బీచ్ యువతి కేసులో మరో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..

బీఆర్ఎస్ పార్టీ లో ఉద్యమంలో ఒక కార్యకర్తగా జెండా మోసి కష్టపడి పనిచేసామని, బీఆర్ఎస్ పార్టీపై ఇంకా నమ్మకం ఉంది.. ప్రగతి భవనానికి పిలిచి మంత్రి హరీష్ రావు, బండ ప్రకాశ్ లు మాట్లాడినా ఇప్పటి వరకు ఏలాంటి పిలుపు లేదన్నారు నీలం మధు. కాంగ్రెస్, బీజేపీ పార్టీ లు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి టికెట్ ఇస్తే పార్టీ గుర్తుపై పోటీ చేస్తా.. లేనిపక్షంలో స్వతంత్రంగా పోటీ చేస్తానని ఆయన అన్నారు. ఈ నెల 16 తేదీన మీ బిడ్డనై వస్తున్నా.. కార్యక్రమం విజయవంతం చేయండని ఆయన కోరారు. కేసీఆర్ ను స్ఫూర్తిగా తీసుకుని పనిచేశామని, కానీ వారు ముదిరాజ్ వర్గాన్ని పట్టించుకోలేదన్నారు. గుడ్ మార్నింగ్ పటాన్ చెరు కార్యక్రమంతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.

Also Read : Bigg Boss Telugu 7: హౌస్లోకి గౌతమ్ రీ ఎంట్రీ…వస్తూనే శివాజీకి షాక్..

Exit mobile version