Prashanth neel : కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్ మూవీతో ఆయన పేరు మార్మోగిపోయింది. స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ లో అలరించాయి. బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కేజీఎఫ్-2 ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. పాన్ ఇండియా లెవెల్లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు ప్రశాంత్ నీల్. సినిమాలో ఆయన ఇచ్చిన ఎలివేషన్లు ఓ రేంజ్ లో అందరినీ అలరించాయి. రిపీట్ మోడ్ లో సినిమా చూసి మరీ ప్రభాస్ అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ లైనప్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మరో ఆరేళ్ల స్టార్ హీరోలతో సినిమాలు చేయనున్నారు. మరి ఆయన లైనప్ లో ఉన్న సినిమాలపై ఓ లుక్కేద్దాం.
Read Also:Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో సెలవు ప్రకటన..
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు ప్రశాంత్ నీల్. కొన్ని రోజుల క్రితం షూటింగ్ స్టార్ట్ అవుతుందని వార్తలు రాగా.. ఇంకా షురూ కాలేదు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి.. 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు నీల్. ఆ తర్వాత సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం చేస్తారు. చిత్రీకరణకు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన సలార్-2.. 2027 సమ్మర్ లో రానుందని సమాచారం. అలాగే కేజీఎఫ్-3 కోసం కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ ను ఇప్పటికే ఆయన రెడీ చేసుకున్నట్లు సమాచారం. డైలాగ్ వెర్షన్ ను కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే అందుకు నీల్ ఒక ఏడాది టైం తీసుకుంటారని తెలుస్తోంది. రీసెంట్ గా మెగా హీరో రామ్ చరణ్, నీల్ కాంబోలో సినిమా ఓకే అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని టాక్ వచ్చింది. ఈ సినిమా 2029 లేదా 2030లో ఆ సినిమా మొదలు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మరో ఆరేళ్ల పాటు ప్రశాంత్ నీల్ డేట్స్ ఖాళీ లేకుండా వరుసగా స్టార్ హీరోలను ఫిక్స్ చేసుకున్నారు.
Read Also:Devara: నందమూరి ఫ్యాన్స్ పై కీలక వ్యాఖ్యలు చేసిన నాగవంశీ..