National Wise Pending Cases: దేశంలోని అన్ని కోర్టుల్లో రోజురోజుకు పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీనిపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య అయిదు కోట్లకు చేరువలో ఉందని తెలిపారు. న్యాయ శాఖ మంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం.
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉన్నా, కింది కోర్టుల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కింది కోర్టుల్లో మౌలిక వసతులు లేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సత్వర న్యాయం అందించడంలో ఎదురవుతున్న ఇబ్బందులపై విశ్లేషించాల్సిన అవసరం ఉందటున్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో కాగిత రహిత డిజిటల్ జ్యుడీషియరీ ఏర్పాటు కానుందని, అప్పుడు కాలహరణ చాలా వరకు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. కేసుల పరిష్కారంలో జాప్యానికి దారితీసే అనేక అంశాలు ఉన్నాయి. వీటిలో, న్యాయమూర్తుల ఖాళీలు, తరచుగా వాయిదాలు, విచారణ కోసం పర్యవేక్షించడానికి, ట్రాక్ చేయడానికి, బంచ్ కేసులను పర్యవేక్షించడానికి తగిన ఏర్పాట్లు లేకపోవడం వంటివి ఉంటాయి.
Read Also: Most Search Indians on Google : సుస్మితాసేన్ కోసం తెగ వెతికేశారట ఎందుకో తెలుసా..?
కోర్టుల్లో పెండింగ్ కేసుల సమస్యకు జడ్జీల సంఖ్యను రెట్టింపు చేయడంతోనే పరిష్కారం లభించదు. సమర్థులైన న్యాయమూర్తులతో పాటు కోర్టుల్లో తగినంత మౌలిక సదుపాయాలూ అవసరమే. కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను రెట్టింపు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ ఆ మధ్య న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ… అలహాబాద్ హైకోర్టులో మంజూరైన 60 జడ్జీల పోస్టులను భర్తీ చేయడమే కష్టంగా ఉందన్నారు. బాంబే హైకోర్టులో ఇప్పటి కన్నా అదనంగా ఒక్క జడ్జీని కూడా నియమించలేమని, ఇందుకు వసతుల కొరతే కారణమని పేర్కొన్నారు.
Read Also : Citadel CEO : ఉద్యోగులకు జీవితాంతం గుర్తుండిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఈవో
ప్రస్తుతం సుప్రీంకోర్టులో 72,062 కేసులు, హైకోర్టుల్లో 5803111 లక్షల కేసులు, జిల్లా కోర్టుల్లో 4.23 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలహాబాద్ హైకోర్ట్ పరిధిలో అత్యధికంగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. తరువాతి స్థానాల్లో ముంబై, కోల్ కతా, గౌహతీ హైకోర్టులనున్నాయి. చిట్టచివరన పాట్న హైకోర్టులో తక్కువ పెండింగ్ కేసులున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్ హైకోర్టు పరిధిలో 247853కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఏపీలో 233788కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక న్యాయమూర్తుల విషయానికొస్తే… సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల పరిమితి సీజేఐతో కలిపి 34 కాగా.. ఇంకా ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైకోర్టుల్లో 1,108 మంది జడ్జిలకు గానూ 336 ఖాళీలు, జిల్లా కోర్టుల్లో 24,827 పోస్టులు ఉండగా 6,604 ఖాళీలు ఉన్నాయి. డిసెంబర్ నాటికి దేశంలో అన్ని కోర్టుల్లో కలిపి సుమారు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
