Site icon NTV Telugu

Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. 100 ఇళ్లు, దుకాణాలు దగ్ధం

Fire Accident

Fire Accident

Fire Accident: అసోం-నాగాలాండ్ సరిహద్దులో అసోంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని బోకాజన్ సమీపంలోని లాహోరిజాన్ ప్రాంతంలో బుధవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు దగ్ధమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంటల్లో పలు సిలిండర్లు పేలిపోయాయి. అగ్ని ప్రమాదంలో రెండు నాలుగు చక్రాల వాహనాలు, మూడు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. పలు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశాయి.

Police on Sharddha Walker Case: శ్రద్ధ 2020లో తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది.. అందుకే..

ఈ అగ్నిప్రమాదంలో దాదాపు 100 ఇళ్లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బోకాజన్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) జాన్ దాస్ వెల్లడించారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు.

Exit mobile version