బీహార్‌లో టోల్‌ప్లాజా గార్డుగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తిని 50 రూపాయలు దొంగిలించాడన్న అనుమానంతో కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. స్థానికంగా ఈ విషయం సంచలనం సృష్టించింది. ఈ ఘటన భోజ్‌పూర్ జిల్లాలోని అర్రా-పాట్నా రహదారిపై కుల్హదియా టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన బల్వంత్ సింగ్‌గా గుర్తించారు. నలుగురైదుగురు కలిసి అతడిని దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: South Central Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వారం రోజులు రైళ్లు రద్దు
అర్రా-పాట్నా రహదారిపై కుల్హదియా టోల్‌ప్లాజాలో దొంగతనానికి పాల్పడ్డాడన్న అనుమానంతో దుండగుల మూక అతడిని తీవ్రంగా కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన బల్వంత్ సింగ్ ఆ తర్వాత తన సొంత గ్రామానికి వెళ్లాడు. ఆ వెంటనే అక్కడే మరణించాడు. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌కు అనుకూలంగా మాట్లాడినందుకు హర్యానాకు చెందిన బౌన్సర్లు ఈ దాడి చేసినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Read Also: CM YS Jagan: చదువు కోసం ఎంత ఖర్చైనా భరిస్తాం.. త్వరలోనే ఐబీ సిలబస్
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. టోల్‌ప్లాజాపై దాడిచేసినట్టు గోండా ఎస్పీ ఆకాశ్ తోమర్ వెల్లడించారు. దాడి తర్వాత టోల్ ప్లాజా సిబ్బంది బాధితుడిని ట్రైన్‌లో సొంతూరికి పంపినట్టు పోలీసులు పేర్కొన్నారు. రైలులో ఆరోగ్యం క్షీణించడంతో గోండా జిల్లాలోని మన్కాపూర్ స్టేషన్‌లో దింపేసిన రైల్వే పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే చికిత్స పొందుతూ బల్వంత్ సింగ్ మరణించాడు. దీనిపై పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.