బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ సత్తా చాటింది. ఉప ఎన్నికలో ఆర్జేడీ, వామపక్షాలను మహా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ ఇండియా కూటమి ప్రభావం ఏ మాత్రం కనబరచలేకపోయింది. బెలగంజ్, ఇమామ్‌గంజ్, రామ్‌గఢ్, తరారీలో ఎన్డీయే అభ్యర్థులు విజయం సాధించారు. తరారీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తొలిసారి విజయం సాధించింది. సునీల్ పాండే తనయుడు విశాల్ ప్రశాంత్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ మాలె రాజు యాదవ్‌పై 10612 ఓట్లతో విజయం సాధించారు. గయా జిల్లాలోని ఇమామ్‌గంజ్‌లో కూడా కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కోడలు దీపా మాంఝీ తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగించారు. ఆమె ఆర్జేడీ అభ్యర్థి రోషన్ మాంఝీని 5945 ఓట్లతో ఓడించింది.
Read Also: IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. భారీ ఆధిక్యంలో టీమిండియా
మరోవైపు.. బెలగంజ్ సీటుపై ఆర్జేడీ మూడు దశాబ్దాల నాటి కంచుకోట కూలిపోయింది. ఇక్కడి నుంచి సురేంద్ర యాదవ్ కుమారుడు విశ్వజీత్ సింగ్ జేడీయూకి చెందిన మనోరమా దేవి చేతిలో ఓడిపోయారు. రామ్‌గఢ్‌లో ఆసక్తికర పోటీలో బీఎస్పీకి చెందిన సతీష్ అలియాస్ పింటూ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి అశోక్ సింగ్ విజయం సాధించారు. ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానం సింగ్ కుమారుడు, ఎంపీ సుధాకర్ సింగ్ సోదరుడు అజిత్ సింగ్ మూడో స్థానంలో నిలిచారు.