TDP-Janasena-BJP Alliance: నేడు ఏపీలో కూటమి ఎమ్మెల్యేల భేటీ.. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలోనే శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును పవన్ ఏకగ్రీవంగా ప్రతిపాదించనున్నారు. దీనికి మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మద్దతు తెలపిన తర్వాత ఆ తీర్మానాన్ని కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కూటమి నేతలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇక, చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించనున్నారు.
Read Also: Jasprit Bumrah: నా కెరీర్ ముగిసిందన్నారు: బుమ్రా
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
అయితే, రేపు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్.. కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే, ఇప్పుడు ఎవరికి కేబినెట్ శాఖ దక్కుతుందో అనే చర్చ జోరుగా కొనసాగుతుంది. కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కబోతున్నాయనే ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే తాను డిప్యూటీ సీఎం పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు జనసేన చీఫ్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఆ పార్టీలో మరికొందరిని మంత్రులుగా ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సీట్ల కేటాయింపులో కాంప్రమైజ్ అయిన జనసేనకు కేబినెట్ పదవుల్లో మాత్రం అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కనీసం ఐదు మంత్రి పదవుల వరకు చంద్రబాబు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రభుత్వంలో ఉంటూనే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఇప్పటికే పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరోవైపు, రేపు( బుధవారం) కేసరపల్లిలో జరగబోవు ప్రమాణస్వీకారోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 11:27 గంటలకు ఏపీ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!