NTV Telugu Site icon

TDP-Janasena-BJP Alliance: నేడు ఏపీలో కూటమి ఎమ్మెల్యేల భేటీ.. శాసన సభాపక్ష నేతగా చంద్రబాబు..!

Ap Cabinet

Ap Cabinet

నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలోనే శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును పవన్ ఏకగ్రీవంగా ప్రతిపాదించనున్నారు. దీనికి మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మద్దతు తెలపిన తర్వాత ఆ తీర్మానాన్ని కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కూటమి నేతలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ఇక, చంద్రబాబును ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించనున్నారు.

Read Also: Jasprit Bumrah: నా కెరీర్‌ ముగిసిందన్నారు: బుమ్రా

అయితే, రేపు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్.. కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే, ఇప్పుడు ఎవరికి కేబినెట్ శాఖ దక్కుతుందో అనే చర్చ జోరుగా కొనసాగుతుంది. కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన పవన్ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు దక్కబోతున్నాయనే ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే తాను డిప్యూటీ సీఎం పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు జనసేన చీఫ్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు ఆ పార్టీలో మరికొందరిని మంత్రులుగా ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సీట్ల కేటాయింపులో కాంప్రమైజ్ అయిన జనసేనకు కేబినెట్ పదవుల్లో మాత్రం అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కనీసం ఐదు మంత్రి పదవుల వరకు చంద్రబాబు ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ప్రభుత్వంలో ఉంటూనే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఇప్పటికే పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మరోవైపు, రేపు( బుధవారం) కేసరపల్లిలో జరగబోవు ప్రమాణస్వీకారోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం 11:27 గంటలకు ఏపీ రాష్ట్రానికి మూడో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.