Site icon NTV Telugu

Earthquake: తజికిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.0గా నమోదు

4444

4444

తజికిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.0గా నమోదైంది. మంగళవారం సాయంత్రం సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఇక్కడ తరచుగా భూప్రకంపలు జరుగుతుంటాయి. తక్కువ స్థాయిలోనే భూకంపం వచ్చింది. ఇదిలా ఉంటే భూప్రకంపనలకు ప్రజలు వణికిపోయారు.

ఇది కూడా చదవండి: China knife attack: ఆస్పత్రి దాడిలో 10కి చేరిన మృతుల సంఖ్య

భూకంపంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. పరిస్థితులను ప్రభుత్వం సమీక్షిస్తోంది. రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఏదైనా ఆస్తి నష్టం జరిగిందా? అన్నదానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సూచించింది.

ఇది కూడా చదవండి: Sonia Gandhi: ఎన్నికల వేళ సోనియా కీలక సందేశం విడుదల

Exit mobile version