NTV Telugu Site icon

NCL Recruitment 2024: ఎన్‌సీఎల్‌లో 150 ట్రైనీ సూపర్‌వైజర్‌ పోస్టులు..ఎలా అప్లై చేసుకోవాలంటే?

Jobbss

Jobbss

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఎన్‌సీఎల్‌లో పలు ఉద్యోగాలకు ధరఖాస్తులను కోరుతూ తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏకంగా 150 ట్రైనీ సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. పోస్టుల వివరాలు అర్హతలు, ఏంటో చూద్దాం..

అర్హతలు..

అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ (ఈ అండ్‌ టీ) ట్రైనీ (గ్రేడ్‌-సి)-9 పోస్టులు. అర్హత: మూడేళ్ల మెట్రిక్యులేషన్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి..

అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ (మెకానికల్‌) ట్రైనీ (గ్రేడ్‌-సి)-59. అర్హత: మెట్రిక్యులేషన్, మూడేళ్ల మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా పూర్తిచేయాలి.

అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌) ట్రైనీ (గ్రేడ్‌-సి)-82. అర్హత: మెట్రిక్యులేషన్, మూడేళ్ల ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

డిగ్రీ /పీజీ /డిప్లొమాలను దూరవిద్య /పార్ట్‌ టైమ్‌ ద్వారా పూర్తిచేసినవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు..

వయసు..

18-30 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం..

రాత పరీక్ష, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను అనుసరించి పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తారు..

ఎలా ప్రిపేర్ అవ్వాలంటే?

సెక్షన్‌-ఎ నుంచి 70 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా సంబంధిత సబ్జెక్టు అంశాల నుంచే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా సబ్జెక్టులను రివిజన్‌ చేసుకోవాలి.. పాత పరీక్ష పేపర్ లను ఒకసారి రివైజ్ చేసుకోవడం మంచిది.. సంబందించిన సబ్జెక్ట్ లను పూర్తి అవగాహనా చేసుకోవాలి..

ముఖ్య సమాచారం..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05.02.2024
వెబ్‌సైట్‌: https://www.nclcil.in/ ను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి..

Show comments