NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ మరియు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం పట్టాలెక్కబోతోంది. వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మే 1వ తేదీన పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం బాలయ్య తన 111వ చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే కొరటాల శివ ప్రాజెక్ట్‌ను కూడా లైన్లో పెట్టారు బాలయ్య. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దర్శకుడు కొరటాల శివ తన సినిమాల్లో బలమైన మెసేజ్ తో పాటు హీరో పాత్రను పవర్ఫుల్ గాచూపిస్తాడు. ఇప్పుడు బాలయ్య మార్క్ పవర్ఫుల్ యాక్షన్‌కు కొరటాల శైలి మేకింగ్ తోడైతే వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘దేవర’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కొరటాల శివ, ఎన్టీఆర్‌తో ‘దేవర 2’ ప్రారంభించడానికి ముందు ఈ గ్యాప్‌లో బాలయ్య సినిమాను పూర్తి చేయనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!