Site icon NTV Telugu

NBK 109: సారీ.. పండక్కి అప్‌డేట్‌ ఇవ్వలేకపోతున్నాం: నాగవంశీ

Nbk 109 Teaser

Nbk 109 Teaser

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘NBK 109’. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్ షెడ్యూల్​ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్​లోని చౌటప్పల్ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీన్స్​ చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే దసరా కానుకగా టైటిల్ అనౌన్స్​మెంట్​ వస్తుందని అందరూ ఆశించినా.. అది జరగలేదు. దీపావళికి వస్తుందని ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

నిర్మాత నాగవంశీ టైటిల్ అనౌన్స్​మెంట్​ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. పండక్కి అప్‌డేట్‌ ఇవ్వలేకపోతున్నాం అని తెలిపారు. ‘సినిమా టైటిల్​ను దీపావళి పండగకు విజువల్స్​తో సహా రూపొందించి అనౌన్స్ చేద్దామనుకున్నాం. పోస్టర్లు వేస్తే ఆ కిక్​ రాదు కాబట్టి వీడియో రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే వీడియో సీజీలతో మూడిపడి ఉంది. సీజీ సమయానికి డెలివరీ అవ్వలేదు. అందుకే పండక్కి అప్‌డేట్‌ ఇవ్వలేకపోతున్నాం. అభిమానులకు సారీ చెబుతున్నా. వారం లేదా పది రోజులు సీజే కోసం సమయం పడుతుంది. నవంబర్ రెండో వారంలో అప్డేట్ ఇస్తాం’ అని నాగవంశీ చెప్పారు. లక్కీ భాస్కర్‌ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో నాగవంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: Gold Rates Hike: అప్పుడు 28 వేలు, ఇప్పుడు 81 వేలు.. బంగారం ధరలు పెరగటానికి కారణం ఏంటంటే?

ఈ చిత్రంలో బాబీ డియోల్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్​లో కనిపించనున్నారు. ఇదివరకు ఎన్నడు చూడని విధంగా బాలయ్య కనిపించబోతున్నారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు కోణాలున్న పాత్రలో సందడి చేయనున్నారు. ఈ చిత్రంకు డాకు మహారాజ్, వీరమాస్, సర్కార్ సీతారాం ఇలా పలు రకాల టైటిల్స్​ పరిశీలనలో ఉన్నాయట.

Exit mobile version