Site icon NTV Telugu

Nayantara : రెస్టారెంట్లో 30నిమిషాలు వెయిటింగ్.. అయినా నయనతారను పట్టించుకోని జనం

New Project (60)

New Project (60)

Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాను ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను ఈ మధ్య తన భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి ఢిల్లీకి వెళ్లింది. అక్కడి కాకే దా హోటల్ లో నార్త్ ఇండియన్ తందూరి టేస్ట్ చేయడానికి నయన్, విఘ్నేష్ సుమారు అరగంటపాటు వేచి చూడాల్సి వచ్చింది. నవంబర్ 18న నయన్ బర్త్ డే వేడుకలను జరుపుకునేందుకు తాము ఢిల్లీ వెళ్లినట్లు విఘ్నేష్ శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు.

Read Also: Deputy CM Pawan Kalyan: మహారాష్ట్రలో ట్రెండ్‌ సెట్‌ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం..

స్టార్ హీరోయిన్ అయినా నయనతార మాత్రం ఈ డిన్నర్ డేట్ కు భర్తతో కలిసి ఓ సాధారణ జంటలాగే వెళ్లింది. ఆ రెస్టారెంట్ చాలా బిజీగా ఉండటంతో టేబుల్ కోసం వీరిద్దరూ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడి ఫుడ్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను రెస్టారెంట్ లోని వ్యక్తి ఎవరో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ డిన్నర్ డేట్, వీడియోపై విఘ్నేష్ శివన్ స్పందించారు. “నవంబర్ 17న ఓ చిన్న బర్త్ డే ఈవెనింగ్ సెలబ్రేషన్స్ కోసం వెళ్లాం. ఆ క్షణాలను క్యాప్చర్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్” అని అంటూ రాసుకొచ్చాడు. ఫుడ్ చాలా టేస్టీగా ఉందన్న విఘ్నేష్.. టేబుల్ కోసం 30నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పడం విశేషం.

Read Also: Shiv Sena: బాలాసాహెబ్ ఠాక్రే వారసుడు ‘‘ఏక్‌నాథ్ షిండే’’.. ఉద్ధవ్‌ని మరిచిన మహా ఓటర్లు..

ఈ వీడియోలో ఈ సెలబ్రిటీ కపుల్ ఒకరికొకరు తినిపించుకోవడం చూడవచ్చు. హిందీలో జవాన్ లాంటి సినిమాలో షారుక్ ఖాన్ తో కలిసి నటించి నార్త్ లోనూ నయన్ మంచి పేరు సంపాదించుకుంది. అలాంటి సెలబ్రిటీ ఓ సాధారణ వ్యక్తిలాగా ఎంతో బిజీగా ఉన్న రెస్టారెంట్ కు వెళ్లి అందరి మధ్యలో కూర్చొని తినడం అక్కడి వాళ్లను ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Exit mobile version