Nayanthara : ఐకాన్ స్టార్ ట్వీట్ కు స్వీట్ రిప్లై ఇచ్చిన లేడీ సూపర్ స్టార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘జవాన్’. జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది లేడీ సూపర్ స్టార్ నయనతార. తమిళ యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో పోటీపడి మరీ నటించింది నయన్.ఇటీవలే విడుదల అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకోవడంతో పాటు..భారీగా కలెక్షన్స్ ను కూడా సాధిస్తోంది. ఈ సినిమాతో హిందీ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది నయన్. వయసు మీద పడుతున్నా కానీ ఆమె క్రేజ్ బాగానే పెరుగుతూ వస్తోంది. ఇక జవాన్ సినిమాలో ఈ భామ పర్ఫార్మెన్స్ ను కొందరు సినీ ప్రముఖులు మెచ్చుకున్నారు.రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జవాన్’ సినిమాను చూసి ట్విట్టర్ లో స్పందించారు.. తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించినందుకు ముందుగా ‘జవాన్’ బృందానికి శుభాకాంక్షలు. ఇది ఎప్పుడూ చూడని షారూక్ ఖాన్ గారి మాస్ అవతార్ అని కొనియాడారు.
అంతే కాదు ఆయన స్వాగ్ తో ఇండియానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఉర్రూతలూగించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్, మేము దీని కోసమో ఎదురు చూసాము అని ట్వీట్ చేశారు.. ఇక విజయ్ సేతుపతి గారు ఎప్పటిలాగే తన పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. దీపికా పదుకొణె ప్రభావవంతమైన స్టార్. నయనతార జాతీయ స్థాయిలో ఎంతో ప్రకాశవంతంగా మెరిసింది. అనిరుధ్ మీరు ఈ దేశంలోని ప్రతి ఒక్కరినీ మీ సంగీతం వైపు తిప్పుకున్నారు. మనందరినీ గర్వపడేలా చేసినందుకు, ఆలోచింపజేసే కమర్షియల్ సినిమాని అందించినందుకు, భారతీయ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించినందుకు డైరెక్టర్ అట్లీ గారికి బిగ్ బిగ్ కంగ్రాట్స్.” అంటూ అల్లు అర్జున్ అభినందించారు..అల్లు అర్జున్ ట్వీట్ కు లేడీ సూపర్ స్టార్ నయనతార స్వీట్ రిప్లై ఇచ్చారు. ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ ను ఇన్ స్టా లో స్టోరీగా పెడుతూ..సో స్వీట్ ఆఫ్ యు అల్లు అర్జున్” అని రాసుకొచ్చింది నయనతార. ప్రస్తుతం నయన్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!