లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.టాలీవుడ్,కోలివుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే.. తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్‌స్టాలోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ నయనతార భర్తను అన్ ఫాలో చేసిందని రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి.. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ విఘ్నేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.. ఇప్పుడు మరో పోస్ట్ పెట్టింది.. మరోసారి ఆ పోస్ట్ వైరల్ అవుతుంది..
నయనతార స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటు వరుస సినిమాల్లో బిజీగా ఉంటుంది…ఎంత స్టార్డమ్ వచ్చినా.. నయనతార మాత్రం సోషల్ మీడియాకు దూరంగానే ఉండేది. కానీ కొన్నిరోజుల కిత్రం తాను కూడా ఇన్స్టాగ్రామ్లో అడుగుపెట్టింది. ఇక ఇటీవల నయనతార ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ లిస్ట్లో విఘ్నేష్ శివన్ పేరు కనిపించలేదు. దీంతో నయన్.. విఘ్నేష్ను అన్ఫాలో చేసిందని వార్తలు మొదలయ్యాయి. అంతే కాకుండా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వింత కోట్ను కూడా షేర్ చేసింది.. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి.. ఈ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా విఘ్నేశ్ శివన్ ఒక పోస్ట్ చేశాడు..
ఇక ఇటీవల నేను కోల్పోయాను అంటూ మరో పోస్ట్ చేసింది నయన్. దీంతో మళ్లీ వీరిద్దరి విడాకుల నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నయన్ జీవితంలో అసలు ఏం జరుగుతుంది.. నిజంగానే మనసు ముక్కలైందా? ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతుంది అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. కేవలం ఆమె పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు. ఎందుకంటే.. రోజు ఎమోషనల్ కోట్స్ షేర్ చేస్తున్న నయన్.. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంది.. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..