కన్నడ నటి నయనతార దక్షిణాది చిత్ర పరిశ్రమలలో మాత్రమే కాకుండా.. బాలీవుడ్ లో కూడా నటించి అక్కడ కూడా భారీ అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తూ దూసుకెళ్తుంది. నయనతార తన వర్క్ కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉంది. కాకపోతే ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉంది. ఈ బ్యూటీ తన ఫ్యామిలీతో కలిసి టూర్‌కి వెళ్లింది. నయన్ తాజాగా హాంకాంగ్ ఒక ప్రసిద్ధ నగరంకు వెళ్లి అక్కడ సేద తీరుతుంది.
VJS50 Maharaja: ఎవరయ్యా ఆ ‘లక్ష్మి’.. మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో ముందుకొచ్చిన విజయ్ సేతుపతి..
అక్కడ ఒక రిసార్ట్‌లో తన పిల్లలతో కలిసి విశ్రాంతి తీసుకుంటుంది. హాంకాంగ్ లో విహారయాత్రలో ఉన్న నయన్, విఘ్నేష్, శివన్, చకర్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. నయనతార ప్రస్తుతం నటించిన తమిళ చిత్రాలలో ఒకటి ” మన్నంగట్టి సీన్స్ 1960.”. ఈ సినిమా చిత్రీకరణ తర్వాత ఆన్ సెట్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహించగా, ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో యోగి బాబు, దుదర్శిని, గౌరీ కిషన్, నరేంద్ర ప్రశాంత్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
T20 World Cup 2024: టీమిండియా మ్యాచ్ పూర్తి షెడ్యూల్ ఇలా.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడొచ్చంటే..
ఈ సినిమాతోపాటు., నయనతార వరుసగా ఒరువన్ 2, టెస్ట్, డియర్ స్టూడెంట్స్, మంచు విష్ణు నిర్మిస్తున్న ‘కన్నప్ప’ లో ఓ ప్రధాన పాత్ర పోషించింది. నయన్ మరో సినిమా ‘ టెస్ట్ ‘ షూటింగ్ పూర్తి చేసుకుంది.
M O M M Y #Nayanthara 👀
In Hong-Long vacation with babies ♥️🧿 pic.twitter.com/3RbGm63xis
— Ever & Forever for Nayan 👀💫❤️ (@SathsaraniSew) May 30, 2024