Site icon NTV Telugu

Connect Trailer : దెయ్యం నిశ్శబ్దంగా వెళ్ళదు.. నయనతార ‘కనెక్ట్‌’ ట్రైలర్‌ వచ్చేసింది..

Connect

Connect

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా కనెక్ట్‌. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మయూరి, గేమ్‌ ఓవర్‌ వంటి హర్రర్‌ థ్రిల్లర్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన అశ్విన్ శరవణన్‌ దర్శకత్వంలో వస్తోందిం. అయితే.. తొలిసారిగా రాత్రి 12 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌ ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ సినిమాపై అంచనాలను పెంచేంసింది. అయితే ఇప్పుడు వచ్చిన ట్రైలర్‌ సైతం సినిమాపై మరింత అంచనాలను పెంచుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో జరిగే భూతవైధ్యం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా రన్‌ టైం కేవలం 90నిమిషాలు మాత్రమే ఉండనుంది.

Also Read : MLA Rajasingh: ఆరోజు మళ్లీ పోస్ట్‌ చేశారు.. ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు

అంతేకాకుండా ఇంటర్వెల్‌ లేకుండానే ఈ సినిమా థియేటర్‌లలో రిలీజ్‌ చేయనుండటం విశేషం. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేష్‌ శివన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ పెద్ద ఎత్తున రిలీజ్‌ చేస్తోంది. అయితే.. ఈ సినిమాలో సత్యరాజ్‌, అనుపమ్‌ ఖేర్‌, వినయ్‌ రాయ్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version