Site icon NTV Telugu

Nayanthara : సమంత కు స్పెషల్ గిఫ్ట్ పంపిన నయన్..

Whatsapp Image 2023 10 12 At 11.12.15 Pm

Whatsapp Image 2023 10 12 At 11.12.15 Pm

దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడి సూపర్ స్టార్‌గా నయనతార పేరు పొందింది.వరుస సినిమాలతో నయన్ ప్రస్తుతం బిజీ గా వుంది. అలాగే సమంత కూడా స్టార్ హీరోయిన్‌గా అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. అంతేకాకుండా నార్త్ సినీ ఇండస్ట్రీలో కూడా బాగానే రాణిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత బాగా క్రేజ్ తెచ్చుకుంటే.. జవాన్ మూవీతో ఆరంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది నయనతార. అయితే వీరిద్దరూ రియల్ లైఫ్‌లో చాలా మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే.తాజాగా సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్ పంపించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. హీరోయిన్లు ఈ మధ్య కాలంలో సినిమాలకే పరిమితం కాకుండా పలు వ్యాపారాలు మరియు సినిమాలు నిర్మించడం చేస్తున్నారు. అలా నయనతార కూడా సొంతంగా వ్యాపారం చేస్తోంది.

ఇటీవలే తన కొత్త వెంచర్‌ను ప్రారంభించింది నయన్. 9 స్కిన్ అనే బ్యూటి కేర్ ప్రాడక్ట్స్ ఉత్పత్తుల సంస్థను ఆమె స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన కాస్మోటిక్స్ ఇండియాతోపాటు మలేషియా మరియు సింగపూర్‌లలో కూడా అమ్ముతున్నారు.అది కొత్త కంపెనీ కావడంతో నయన్ వాటిని బాగానే ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే తన స్నేహితురాలికి నయనతార 9 స్కిన్ నుంచి బేస్ క్రీమ్ కాస్మోటిక్స్ గిఫ్టుగా పంపి ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా సమంత తెలియజేసింది ఈ ఉత్పత్తులు ఎంతో అమెజింగ్‌గా ఉన్నాయి. వీటిని వాడేందుకు చాలా ఉత్సాహంగా ఉంది. థ్యాంక్యూ నయనతార. 9 స్కిన్‌కి ఆల్ ది వెరీ బెస్ట్ అని సమంత తన ఇంస్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చింది.అయితే, తన ఫ్రెండ్‌షిప్ కొద్ది సమంతకు నయన్ గిఫ్ట్ పంపినా.. అది కూడా తన ప్రొడక్ట్ ప్రచారంలో భాగం కావడంతో ఇలా కూడా గిఫ్ట్స్ ఇస్తారా అని నెటిజన్లు వివిధ కామెంట్స్ పెడుతున్నారు. .

Exit mobile version