Nayanthara : సమంత కు స్పెషల్ గిఫ్ట్ పంపిన నయన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడి సూపర్ స్టార్‌గా నయనతార పేరు పొందింది.వరుస సినిమాలతో నయన్ ప్రస్తుతం బిజీ గా వుంది. అలాగే సమంత కూడా స్టార్ హీరోయిన్‌గా అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. అంతేకాకుండా నార్త్ సినీ ఇండస్ట్రీలో కూడా బాగానే రాణిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత బాగా క్రేజ్ తెచ్చుకుంటే.. జవాన్ మూవీతో ఆరంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది నయనతార. అయితే వీరిద్దరూ రియల్ లైఫ్‌లో చాలా మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే.తాజాగా సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్ పంపించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. హీరోయిన్లు ఈ మధ్య కాలంలో సినిమాలకే పరిమితం కాకుండా పలు వ్యాపారాలు మరియు సినిమాలు నిర్మించడం చేస్తున్నారు. అలా నయనతార కూడా సొంతంగా వ్యాపారం చేస్తోంది.
ఇటీవలే తన కొత్త వెంచర్‌ను ప్రారంభించింది నయన్. 9 స్కిన్ అనే బ్యూటి కేర్ ప్రాడక్ట్స్ ఉత్పత్తుల సంస్థను ఆమె స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన కాస్మోటిక్స్ ఇండియాతోపాటు మలేషియా మరియు సింగపూర్‌లలో కూడా అమ్ముతున్నారు.అది కొత్త కంపెనీ కావడంతో నయన్ వాటిని బాగానే ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే తన స్నేహితురాలికి నయనతార 9 స్కిన్ నుంచి బేస్ క్రీమ్ కాస్మోటిక్స్ గిఫ్టుగా పంపి ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా సమంత తెలియజేసింది ఈ ఉత్పత్తులు ఎంతో అమెజింగ్‌గా ఉన్నాయి. వీటిని వాడేందుకు చాలా ఉత్సాహంగా ఉంది. థ్యాంక్యూ నయనతార. 9 స్కిన్‌కి ఆల్ ది వెరీ బెస్ట్ అని సమంత తన ఇంస్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చింది.అయితే, తన ఫ్రెండ్‌షిప్ కొద్ది సమంతకు నయన్ గిఫ్ట్ పంపినా.. అది కూడా తన ప్రొడక్ట్ ప్రచారంలో భాగం కావడంతో ఇలా కూడా గిఫ్ట్స్ ఇస్తారా అని నెటిజన్లు వివిధ కామెంట్స్ పెడుతున్నారు. .
Also Read
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్‌డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
తాజావార్తలు
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్‌తో మరోసారి భారీ కాంబినేషన్?
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!