NTV Telugu Site icon

MIG 29K Jet Crash: గోవా తీరంలో కుప్పకూలిన మిగ్‌ 29కె యుద్ధ విమానం

Mig 29k Fighter Jet

Mig 29k Fighter Jet

MIG 29K Jet Crash: గోవాలో తీరంలో మిగ్-29 కె యుద్ధ విమానం కూలిపోయింది. మిగ్‌ 29-కె యుద్ధ విమానం తిరిగి స్థావరానికి వస్తుండగా గోవా తీరంలో కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణంగా విమానం కూలినట్లు ఇండియన్‌ నేవీ ప్రకటించింది. అయితే ఈ ఘటనలో అందులో ఉన్న పైలట్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు నావికాదళం వర్గాలు తెలిపాయి. పైలట్ పరిస్థితి నిలకడగా ఉందని నేవీ ప్రకటించింది. సముద్రంలో పడిన విమానం కోసం గాలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవాలని బోర్డ్ ఆఫ్ ఎంక్వైరీ (BoI) ఆదేశించిందని భారత నావికా దళం ప్రకటించింది. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Joe Biden: నాతో మాట్లాడాలనుకుంటే.. పుతిన్‎ను ఒక్కటే అడుగుతా: జో బైడెన్

సాంకేతిక లోపం కారణంగానే మిగ్‌-29 కే కూలిపోయినట్లు నేవీ అధికారులు భావిస్తున్నారు. కాగా, మిగ్‌-29 కే యుద్ధవిమానాలు 2019 లో ఇండియన్‌ నేవీలో చేరిన తర్వాత కూలిపోవడం ఇది నాలుగోసారి.రష్యాలో తయారైన మిగ్‌-29 కే విమానాల్లో కే-36D-3.5 ఎజెక్షన్‌ సీటుతో అమర్చబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైనదిగా పరిగణిస్తుంటారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎజెక్షన్‌ హ్యాండిల్‌ లాగడంతో వెనక సీటులో ఉండే పైలట్‌ ముందుకు ఎజెక్ట్‌ అయి సురక్షితంగా బయటపడేందుకు సాయపడటం ఈ ఎజెక్షన్‌ సీటు ప్రత్యేకత. 2020 ఫిబ్రవరి, నవంబర్‌ నెలల్లో రెండు మిగ్‌-29 కే విమానాలు కూలిపోయాయి. నవంబర్ 2020లో మిగ్‌-29కె యుద్ధవిమానం కూలిన ఘటనలో ఒక ఫైటర్ పైలట్ మరణించాడు. ఘటన జరిగిన వెంటనే పైలట్‌లలో ఒకరిని రక్షించగా, ప్రమాదం జరిగిన 11 రోజుల తర్వాత కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహాన్ని వెలికితీశారు. అదే ఏడాది ఫిబ్రవరిలో పక్షులు ఢీకొనడంతో మరో మిగ్‌ 29కె కూలిపోయింది. 2019, నవంబర్‌లో, గోవాలోని ఒక గ్రామం వెలుపల మిగ్-29కె శిక్షణ విమానం కూలిపోయింది. పైలట్లిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.