Site icon NTV Telugu

Pahalgam Terror Attack: నవ జంట జీవితాల్లో విషాదం నింపిన ఉగ్రదాడి.. నేవీ అధికారి భార్య శవపేటికకు సెల్యూట్ చేసి వీడ్కోలు

Narwal

Narwal

పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పులు ఓ నవ జంట జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన వారం రోజుల్లోనే కన్నీళ్లను మిగిల్చింది. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో భర్త ప్రాణాలు కోల్పోయాడు. కళ్ల ముందే భర్త చనిపోవడంతో నవ వధువు గుండెలు పగిలేలా రోధించింది. హనీమూన్ కోసం వెళితే ప్రాణాలే పోయాయి. మృతదేహాన్ని ఇంటికి చేర్చారు అధికారులు. నేవీ అధికారి భార్య శవపేటికకు సెల్యూట్ చేసి వీడ్కోలు పలికింది. “జై హింద్” అని నినిదిస్తూ అతనికి వీడ్కోలు వందనం చేసింది.

Also Read:Sri Chaitanya : తెలంగాణ ఇంటర్మీడియేట్ ఫలితాల్లో సత్తా చాటిన శ్రీచైతన్య విద్యార్థులు

హర్యానాలోని కర్నాల్‌కు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) ఏప్రిల్ 16న హిమాన్షి నర్వాల్‌ను వివాహం చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత రిసెప్షన్ జరిగింది. హనీమూన్ కోసం ఆ జంట కాశ్మీర్‌కు బయలుదేరారు. ఒక రోజు తర్వాత, వారు పహల్గామ్ సమీపంలోని బైసరన్ అనే అందమైన గడ్డి మైదానంలో ‘భేల్పురి’ ఆస్వాదిస్తున్నప్పుడు, ఓ ఉగ్రవాది లెఫ్టినెంట్ నర్వాల్ తలపై కాల్చాడు. నర్వాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం, లెఫ్టినెంట్ నర్వాల్ మృతదేహాన్ని శవపేటికలో ఢిల్లీకి తీసుకువచ్చారు. హిమాన్షి పక్కన నిలబడి గుండెలవిసేలా రోధించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా శవపేటికకు వందనం చేసి హిమాన్షితో మాట్లాడి అతడి మృతికి సంతాపం తెలిపారు.

Exit mobile version