Site icon NTV Telugu

Tirumala: తిరుమలలో నేటితో ముగియనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు

Tirumala

Tirumala

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ ఉదయం వరాహ పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నప్న తిరుమంజనాని అర్చకులు నిర్వహించనున్నారు. ఇక, చక్రతాళ్వార్‌కీ అర్చకులు పుష్కరిణిలో శ్రీవారికి అవబృద్ద స్నానం చేయించనున్నారు. దీంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఇవాళ (సోమవారం) రాత్రి బంగారు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వామివారి చక్రస్నాన మహోత్సవాన్ని తిలకించేందుకు తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Read Also: AAICLAS Recruitment : ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. 436 పోస్టులకు గ్రీన్ సిగ్నల్..

కాగా, శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదోవ రోజు నిన్న (ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరధంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. మలయప్ప స్వామిని దర్శించుకునేందుకు పురవీధుల్లోకి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అలాగే రాత్రి 7 గంటలకు శ్రీనివాసుడు అశ్వ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దీవెనలు ఇచ్చారు. ఇవాళ ఉదయం జరిగిన చక్రస్నానంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.

Exit mobile version