NTV Telugu Site icon

Naveen Wul Haq : విరాట్ కోహ్లీని రెచ్చగొడుతున్న నవీన్ ఉల్ హాక్..

Naveen Ulhaq

Naveen Ulhaq

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ వుల్ హక్ మధ్య జరిగిన గొడవ.. సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. ఈ మ్యాచ్ జరిగిన వారం దాటినా ఎవ్వరూ ఈ గొడవను మాత్రం మరిచిపోలేదు. ఈ మ్యాచ్‌లో నవీన్ ఉల్ హక్‌, గంభీర్‌లతో విరాట్ కోహ్లీ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. నవీన్ వుల్ హక్‌ని ‘నువ్వు నా కాలి బూటుకి అంటిన దుమ్ముతో సమానం’ అనే అర్థం వచ్చేలా చేసిన సైగలు పెను దుమారం రేకెత్తించాయి.

Also Read : Hyderabad: రేపిస్ట్ నుంచి ఆరేళ్ల బాలిక సేవ్ చేసిన ర్యాపిడో డ్రైవర్

ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ గురించి విరాట్ కోహ్లీ, ఎప్పుడూ లేనట్టుగా వృద్ధిమాన్ సాహా ఇన్నింగ్స్‌ని, రషీద్ ఖాన్ పట్టిన క్యాచ్‌ని అభినందిస్తూ ఇన్‌స్టా గ్రామ్ లో స్టోరీ పెట్టాడు.. తాజాగా నవీన్ వుల్ హక్ కూడా ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ని ఫాలో అవుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 4 బంతులు ఆడి కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు.

Also Read : Tamil Nadu: శభాష్ నందిని.. ప్లస్ టూలో 600/600 మార్కులు.. సీఎం అభినందనలు

కోహ్లీ ఔటైన తర్వాత అనుజ్ రావత్ కూడా 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 16 పరుగులకే 2 కీలకమై వికెట్లను ఆర్సీబీ కోల్పోయింది. విరాట్ అవుటైన తర్వాత మ్యాచ్ చూస్తూ మామిడి పండ్లు తింటున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టాడు. ‘స్వీట్ మ్యాంగోస్’ అంటూ దానికి నవీన్ ఉల్ హక్ కాప్షన్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదుగుతున్నా.. నవీన్ ఉల్ హక్, విరాట్ కోహ్లీతో గొడవని ఇంత పర్సనల్‌గా తీసుకోవడం అతని కెరీర్‌కి మంచిది కాదని టీమిండియా అభిమానులు అంటున్నారు.