NTV Telugu Site icon

Naveen Polishetty Dialogues: కష్టపడ్డా.. అనుష్క శెట్టితో చేశా! నవీన్ పొలిశెట్టి డైలాగ్స్ వైరల్

Naveen Polishetty Dialogues

Naveen Polishetty Dialogues

Hero Naveen Polishetty imitates Telangana Minister Malla Reddy: ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాలతో నవీన్ పొలిశెట్టి బాగా పాపులర్ అయ్యాడు. కామెడీ డైలాగ్స్, కామెడీ టైమింగ్, హావభావాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తున్నాడు. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ఆరంభం నుంచి ఆచితూచి సినిమాలు చేసే నవీన్ పొలిశెట్టి.. ఇప్పుడు ఏకంగా సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టితో నటిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా తెరకెక్కితోంది.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకు మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా ఆగ‌స్ట్ 4న విడుదల కానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ‘లేడీ లక్’ అనే పాటను తాజాగా రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి కాలేజ్‌కు వెళ్లిన నవీన్ పొలిశెట్టి.. అక్కడి విద్యార్థులతో సందడి చేశాడు. లేడీ ఫ్యాన్స్‌తో స్టేజ్ మీద డాన్స్ వేశాడు. అంతే కాకుండా మంత్రి మల్లారెడ్డి డైలాగులతో అందరినీ నవ్వించేశాడు.

Also Read: Tomatoes As Birthday Gift: బర్త్‌డే గిఫ్ట్‌గా 4 కేజీల టమోటాలు.. తెగ ఆనందపడిపోయిన మహిళ!

కష్టపడ్డా, పాలు అమ్మినా, పూలు అమ్మినా, కాలేజీల్ పెట్టినా.. అని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాను ఓ ఊపుఊపిన విషయం తెలిసిందే. ఇప్పటికి కూడా చాలా మంది ఈ డైలాగ్స్ వాడుతున్నారు. తాజాగా తన సినిమా ప్రమోషన్స్‌ కోసం హీరో నవీన్ పొలిశెట్టి ఈ డైలాగ్స్‌ను ఇమిటేట్ చేశాడు. ‘ఇన్ని హిట్లు ఏడికెల్లి ఒచ్చినయ్. నేనేమన్నా మాయ చేసిన్నా లేదా మంత్రం వేసిన్నా. కష్టపడ్డా.. స్క్రిప్టులు రాసిన.. యూట్యూబ్‌లో చేసినా.. అనుష్క శెట్టితో సినిమా చేసినా.. సక్సెస్ అయిన’ అని నవీన్ పొలిశెట్టి డైలాగ్స్ చెప్పాడు.

మంత్రి మల్లారెడ్డి స్టైల్లో నవీన్ పొలిశెట్టి చెప్పిన డైలాగ్స్‌కు మల్లారెడ్డి కాలేజ్‌ స్టూడెంట్స్ తెగ ఎంజాయ్ చేశారు. స్టూడెంట్స్ కొందరు పడిపడి నవ్వుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. జాతి రత్నాలు లాంటి భారీ హిట్ అందుకోవడంతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగ‌స్ట్ 4 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో స్టాండప్ కమెడియన్‌గా నవీన్, చెఫ్‌గా అనుష్క నటిస్తున్నారు.

Also Read: CM KCR : వీఆర్ఏలకు గుడ్‌న్యూస్‌.. విద్యార్హతను బట్టి ఉద్యోగం కేటాయింపు

Show comments