NTV Telugu Site icon

Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3కి స్టార్ హీరో

Nani

Nani

ఆహాలో ప్రసారం కానున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 తదుపరి ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నాని అలరించనున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 యొక్క 18వ మరియు 19వ ఎపిసోడ్‌లలో ఎంతో ఇష్టపడే నేచురల్ స్టార్ నాని కనిపించబోతున్నారు. సీజన్ 2లో నాని గతంలో తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్‌ మీద సందడి చేయగా.. ఆ తరువాత ఆయన హీరోగా చేసిన ‘దసరా’ సూపర్ హిట్ అయింది. నాని తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో కనిపించిన క్రమంలో చాలా మంది నుంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో నానిని మరోసారి ఈ స్టేజ్ మీద సందడి చేయాల్సిందిగా కోరారు తెలుగు ఇండియన్ ఐడల్ నిర్వాహకులు.

Bharateeyudu 3: అబ్బే ఇప్పట్లో లేనట్టే!!

దసరాలో నాని యొక్క అద్భుతమైన నటనకు ఇటీవలే సౌత్ 2024లో ఉత్తమ నటుడు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. ఆగస్ట్ 29, 2024న విడుదల కానున్న తన రాబోయే చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ లో కూడా నాని బిజీగా ఉన్నాడు. మొదటి తొమ్మిది మంది పోటీదారులతో పాటు షో జడ్జీలు ఎస్.ఎస్ తమన్, గీతా మాధురి అలాగే కార్తీక్‌లతో నాని సందడి చేయనున్నారు. నానితో స్పెషల్ ఎపిసోడ్స్ శుక్రవారం మరియు శనివారాల్లో రాత్రి 7 గంటల నుంచి ఆహాలో ప్రత్యేకంగా ప్రసారం కానున్నాయి.

YS Jagan: హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్తాం.. సీతారాంపురం ప్రజలను కాపాడుకుంటాం..

Show comments