Site icon NTV Telugu

Ntr : ఆ హీరో తో మల్టీ స్టారర్ సినిమా చేయాలనీ ఉంది..?

Whatsapp Image 2023 06 08 At 8.33.23 Pm

Whatsapp Image 2023 06 08 At 8.33.23 Pm

జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే కనుక మహేష్ బాబు తో కలిసి నటించాలని ఉందని ఆయన పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే కనుక దానవీర శూరకర్ణ మాత్రమే చేస్తానని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలిపారు.అలాగే రాజమౌళి,వినయక్, కృష్ణవంశీ ఈ ముగ్గురి దర్శకులలో లలో ఎవరు మీకు బెస్ట్ అనే ప్రశ్నకు ఈ ప్రశ్న చాలా ఛండాలమైన ప్రశ్న అని ఎన్టీఆర్ చెప్పడం జరిగింది.

ఆ డైరెక్టర్లలో నాకు ముగ్గురూ ఇష్టమని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని ఎన్టీఆర్ అన్నారు. ఆ ప్రశ్నకు మాత్రం ఛాయిస్ లేదని ముగ్గురూ ముఖ్యమని ఆయన వెల్లడించడం జరిగింది.. ముగ్గురితో నాకు అద్భుతమైన అనుభవాలు ఉన్నాయని ఎన్టీఆర్ పేర్కొన్నారు. నాలోని యాక్టర్ ని ఆ ముగ్గురు డైరెక్టర్లు అద్భుతంగా చూపించారని ఆయన తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులతో ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్ తో ఒకసారి పని చేసిన దర్శకులు మళ్లీ పని చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు. లేడీ ఫ్యాన్స్ నన్ను స్లిమ్ గా చూడాలని కోరుకుంటున్నారని ఎన్టీఆర్ అన్నారు. ఆ తరం హీరోయిన్లలో నాకు శ్రీదేవి గారు చాలా ఇష్టమని ఆయన తెలిపారు. ఫేవరెట్ యాక్టర్ గా సీనియర్ ఎన్టీఆర్ ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టమని ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ రేంజ్ ను పెంచేలా బిజినెస్ పరంగా వేరే లెవెల్ లో ఈ సినిమా ఉండనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తుంది.

Exit mobile version