National Retail Trade Policy: దేశవ్యాప్తంగా ఉన్న చిల్లర వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జాతీయ విధానాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే ఉన్న పాలసీలో పలు మార్పులు చేర్పులు చేయనుంది. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని తీసుకురానుంది. దీంతో.. వర్తకులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
read more: India’s First C-295 Aircraft: టాటా, ఎయిర్‌బస్ కలిసి రూపొందిస్తున్న తొలి సైనిక విమానం
మెరుగైన మౌలిక సదుపాయాలు, మరింత క్రెడిట్ పెరగనుంది. ఆన్‌లైన్ రిటైలర్లకు కూడా ఇ-కామర్స్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉంది. ఫలితంగా.. ఇ-కామర్స్ మరియు రిటైల్ వ్యాపారుల మధ్య సమన్వయం పెరిగేందుకు ప్రయత్నించనుంది. చిల్లర వ్యాపారుల కోసం ఇన్సూరెన్స్ స్కీమ్‌ను సైతం రూపొందించే పనిలో పడింది.
మరీ ముఖ్యంగా ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల చిన్న వ్యాపారులకు లబ్ధి కలుగుతుందని భావిస్తోంది. ఈ విషయాలను.. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్.. DPIIT జాయింట్ సెక్రెటరీ సంజీవ్ తెలిపారు. అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తేవటంపై దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలను కోరారు.