NTV Telugu Site icon

Medical College: జనగామ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుమతి

National Medical Commissio

National Medical Commissio

Medical College in Janagaon: ఈ ఏడాది 9 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో మరో అడుగు పడింది. జనగామ మెడికల్‌ కాలేజీకి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో మరో వంద ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది మంజూరైన ఐదో మెడికల్‌ కాలేజీ ఇది. ఇటీవల ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్‌లకు అనుమతి లభించింది.

Read Also: Mahamood Ali: ఈద్గాను ప్రారంభించిన మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి

దీంతో ఈ ఏడాదికిగాను అనుమతుల సంఖ్య 5కి చేరింది. మరో నాలుగు కాలేజీల అనుమతుల ప్రక్రియ చివరి దశకు చేరింది. నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల కాలేజీల అనుమతులు తుది దశలో ఉన్నాయి. గతేడాది 8, ఈ ఒక్క ఏడాదిలో 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించాలనేది సీఎం కేసీఆర్ ధ్యేయం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా వేగంగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. జనగాం మెడికల్ కాలేజీకి అనుమతి రావడంకో మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.