NTV Telugu Site icon

NIA: ఉగ్రదాడి కేసులో దేశ వ్యాప్తంగా ఎన్‌ఐఏ 22 చోట్ల దాడులు

Nia

Nia

NIA Rides On Jaish-e-Mohammad: పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సానుబుతిపరులపై దర్యాప్తు భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (NIA) శనివారం 5 రాష్ట్రాల్లోని 22 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఢిల్లీలో దాడులు నిర్వహించారు. మహారాష్ట్రలోని మాలెగావ్‌ లోని హోమియోపతి క్లినిక్‌పై ఎన్‌ఐఏ బృందం దాడులు చేసింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, కుట్రకు సంబంధించిన ప్రధాన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా విస్తృత దాడులు ప్రారంభించింది. RC-13/24/NIA/DLI కేసు కింద ఈ చర్య తీసుకోబడింది. దింతో దేశవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ నెట్‌వర్క్ లక్ష్యంగా చేసుకొని 5 రాష్ట్రాల్లోని 22 చోట్ల ఈ దాడులు నిర్వహిస్తున్నారు.

Manu Bhaker: మొదటిసారి ఓటు వేసిన ఒలింపిక్ పతక విజేత మను భాకర్

పాన్ ఇండియా స్థాయిలో జైష్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఇంత సమగ్ర చర్య తీసుకోవడం ఇదే మొదటిసారి. ఉగ్రవాద సంస్థ నెట్‌వర్క్ జమ్మూ కాశ్మీర్ వెలుపల కూడా విస్తరిస్తోంది. ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలోని ముస్తఫాబాద్‌లో ఎన్‌ఐఏ అర్థరాత్రి దాడి చేసింది. ఈ ఆపరేషన్‌లో ఎన్‌ఐఏతో పాటు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. సోదాల్లో అనుమానాస్పద వస్తువులు లభించినట్లు సమాచారం అందుతోంది. అధికారులు కొంతమందికి నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే ఇద్దరినీ మందిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి రాత్రంతా కొనసాగి తెల్లవారుజామున ముగిసింది.

Gorre Puranam : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గొర్రె పురాణం’

Show comments