Site icon NTV Telugu

National Games 2022: జాతీయ క్రీడల్లో తెలుగు అథ్లెట్ల జోరు

Esha Singh

Esha Singh

National Games 2022: ప్రతిష్ఠాత్మక జాతీయ క్రీడల్లో తెలుగు రాష్ట్రాల అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తు్న్నారు. తెలంగాణ షూటర్ ఇషాసింగ్, ఆంధ్రపదేశ్‌ స్ప్రింటర్ జ్యోతి యర్రాజి స్వర్ణాలు గెలిచారు. మహిళల 25మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగం ఫైనల్లో ఇషా సింగ్‌ 26 పాయింట్లతో టాప్‌లో నిలిచి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఇదే విభాగంలో పోటీపడ్డ రితమ్‌ సాంగ్వాన్‌(25, హర్యానా), అబింద్యా అశోక్‌(19, మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మనుబాకర్‌ను వెనక్కి నెట్టి 584 స్కోరుతో ఫైనల్‌కు చేరిన ఇషా సింగ్.. ఫైనల్లోనూ అదే దూకుడు ప్రదర్శించి 26 పాయింట్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. రోలర్‌ స్కేటింగ్‌ ఆర్టిస్టిక్‌ జోడీ నృత్య విభాగంలో కాంతి- జుహిత్‌ (తెలంగాణ) జోడీ కంచు పతకం సొంతం చేసుకుంది. 71 పాయింట్లతో ఈ జంట మూడో స్థానాన్ని దక్కించుకుంది. యశస్వి- రాహుల్‌ (90.8- మహారాష్ట్ర), నటాలియా- ఆదిత్య (79- తమిళనాడు) జోడీలు వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

మహిళల అథ్లెటిక్స్‌ 100 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం సాధించగా… 400 మీటర్ల విభాగంలో దండి జ్యోతిక శ్రీ రజత పతకం సొంతం చేసుకుంది. 11.51 సెకన్లలో జ్యోతి రేసును ముగించి స్వర్ణం ఖాతాలో వేసుకుంది. జాతీయ క్రీడల్లో ఇదే అత్యుత్తమ టైమింగ్ కావడం గమనార్హం. అర్చన (11.55సె- తమిళనాడు) రజతం, దియాండ్ర (11.62సె- మహారాష్ట్ర) కాంస్యం నెగ్గారు. ద్యుతి చంద్‌ (11.69సె), హిమదాస్‌ (11.74సె) లాంటి స్టార్‌ స్ప్రింటర్లు వరుసగా 6, 7 స్థానాల్లో నిలవడం గమనార్హం. పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌ 67 కేజీల విభాగంలో నీలం రాజు రజత పతకం దక్కించుకున్నాడు. మొత్తం 270 కేజీల బరువెత్తి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

Megastar Chiranjeevi: దండేసి గొర్రె పొట్టెల్ని బలికి తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారు

మరవైపు పురుషుల లాంగ్‌జంప్‌లో పసిడి సాధించిన జెస్విన్‌ అల్‌డ్రిన్ 023 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌కూ అర్హత సాధించాడు. చివరి ప్రయత్నంలో 8.26 మీటర్ల దూరం దూకిన అతను.. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ అర్హత ప్రమాణాన్ని (8.25మీ) అందుకున్నాడు. కామన్వెల్త్‌ క్రీడల రజత విజేత మురళీ శ్రీశంకర్‌ (7.93మీ) రెండో స్థానానికి పరిమితమయ్యాడు. తొలి రెండు ప్రయత్నాల్లో వరుసగా 7.93మీ, 7.55మీ. దూరం దూకిన శ్రీశంకర్‌ తొడ కండరాల గాయం కారణంగా మిగతా నాలుగు సార్లు జంప్‌ చేయకుండా పోటీ నుంచి నిష్క్రమించాడు.

 

Exit mobile version