Site icon NTV Telugu

Raj Tarun: ఎక్కడున్నా మా ముందుకు రావాల్సిందే.. రాజ్ తరుణ్ కు పోలీసుల నోటీసు

Raj Tarun

Raj Tarun

Raj Tarun: గత వారం రోజుల క్రితం నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో హీరో రాజ్ తరుణ్ ( Raj Tarun ) ప్రేమ వివాహం సంబంధించిన విషయం ట్రెండింగ్ గా కొనసాగుతోంది. ప్రతిరోజు ఈ విషయం సంబంధించి ఒక్కొక్క విషయం బయటికి రావడంతో ఈ విషయంపై సినీ అభిమానులు ఎక్కువగా ఆసక్తి చెబుతున్నారు. హీరో రాజ్ తరుణ్ ప్రియురాలిని అంటూ లావణ్య ( Lavanya ) ఇచ్చిన ఫిర్యాదు పై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అనేక వివరాలను లావణ్య లాయర్ ఇప్పటికే తెలిపారు. అయితే., తాజాగా హీరో రాజ్ తరుణ్ కు నార్సింగ్ పోలీస్ స్టేషన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరుకు రాజ్ తరుణ్ పై ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Mahesh Babu Birthday: మొత్తానికి మహేష్ బర్త్డే ట్రీట్ రెడీ చేశారు..

ఈ కేసుకు సంబంధించిన వివరాల విషయమై హీరో రాజ్ తరుణ్ విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూలై 18 లోపల పోలీసుల ఎదుట హాజరు అవ్వాలని నోటీసులు అందజేశారు. BNSS 45 కింద నార్సింగ్ పోలీస్ స్టేషన్ పోలీసులు రాస్తారోకో నోటీసులు జారీ చేశారు. హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో పోలీసులు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు అంతట చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా స్వగ్రామం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో హీరో రాజ్ తరుణ్ ఎక్కడున్నా సరే.. మా ముందుకు రావాల్సిందే అంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Low BP vs High BP: అసలు ఈ లోబీపీ, హైబీపీ మధ్య తేడా ఏంటి..

Exit mobile version