NASA: అప్పుడప్పుడు అనంత విశ్వం నుంచి గ్రహ శకలాలు భూమి వైపు వస్తుంటాయి. ఇవి భూమిని ఢీకొట్టితే పెను ప్రమాదమే సంభవించే అవకాశం ఉంది. దీంతో భూమి వైపుగా దూసుకొచ్చే గ్రహశకలాలను దారి మళ్లించడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) ప్రయోగం విజయవంతమైంది. గత నెల 26న డార్ట్ వ్యోమనౌక డౌమార్ఫస్ అనే గ్రహశకలాన్ని ఢీకొట్టింది. దీంతో అది తన కక్ష్యను మార్చుకున్నట్టు నాసా తాజాగా ప్రకటించింది.
Read Also: Big Sale: బ్రాండెడ్ వాచ్‌కు ఆర్డర్ పెడితే.. గ్రాండ్‌గా పేడపెట్టి పంపించారు
తమ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటుచేసుకున్నట్లు నాసా మంగళవారం ప్రకటించింది. గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ‘సేవ్ ది వరల్డ్’ టెస్టింగ్‌ను ప్రకటించినప్పుడు ఏజెన్సీ ఈ సమాచారాన్ని అందించింది. తాము పంపిన వ్యోమనౌక ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టిందని.. దాని కారణంగా అందులో భారీ బిలం ఉందని, దాని వ్యర్థాలు అంతరిక్షంలో వ్యాపించాయని నాసా తెలిపింది. ఇది వాహనంపై ఎంత ప్రభావం చూపిందో అంచనా వేయడానికి 520 అడుగుల పొడవున్న ఈ గ్రహశకలం ఎంత తేడా చేసిందో తెలుసుకోవడానికి.. డుబ్రిన్ సహాయంతో చాలా రోజుల పాటు పర్యవేక్షించారు నాసా పరిశోధకులు.
Read Also: Joe Biden: నాతో మాట్లాడాలనుకుంటే.. పుతిన్‌ను ఒక్కటే అడుగుతా: జో బైడెన్
గ్రహశకలం వాహనాన్ని ఢీకొనడానికి ముందు.. కక్ష్య చుట్టూ తిరగడానికి 11 గంటల 55 నిమిషాలు పట్టిందని నాసా తెలిపింది. అదే సమయంలో, ఇందులో 10 నిమిషాల తగ్గుదల నమోదైందని తెలిపింది.వాస్తవానికి, భూమి వైపు వచ్చే గ్రహశకలం దిశను మార్చడానికి నాసా తన మొదటి ప్రయోగాన్ని నిర్వహించింది. గత ఏడాది ఇదే సమయంలో గంటకు 22 వేల 500 కిలోమీటర్ల వేగంతో 1.10 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రహశకలాన్ని ఢీకొట్టింది.