ఏలియన్స్ ఉన్నాయా? అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ లను గ్రహాంతర వాసులే పంపుతున్నారా? అనే అంశాలపై చాలా కాలంగా ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఏలియన్స్ ఉన్నాయన్న కచ్చితమైన ఆధారాలను ఇప్పటి వరకు ఎవరూ బయట పెట్టలేక పోయారు. ఏలియన్స్ గురించి ఊహాజనిత విషయాలను చాలా మంది చెప్పారు. యూఎఫ్‌వోలను ఫ్లయింగ్ సాసర్లు అని కూడా పిలుస్తుంటారు. అయితే, వీటిపై అధ్యయనం చేసిన నాసా.. గ్రహాంతర వాసుల గురించి వివరించేందుకు రెడీ అయింది. అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫెనోమినాపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఓ స్వతంత్ర అధ్యయన టీమ్ సంవత్సరం నుంచి పరిశోధనలు చేసింది.
Read Also: Crime News: నుదుటిపై తిలకం చూసి హత్య.. ఇద్దరు ఉగ్రవాదులకు మరణశిక్ష
యూఏపీనే యూఎఫ్‌వో, ఫ్లయింగ్ సాసర్లుగా అభివర్ణిస్తున్నారు. ఇక, 2022లో నాసా ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ టీమ్ ఏలియన్లపై నివేదికతో రెడీగా ఉంది. యూఎఫ్‌వోలను గ్రహాంతరవాసుల వ్యోమ నౌకలుగా చాలా మంది పిలుస్తుంటారు. ఇతర గ్రహాల నుంచి అప్పుడప్పుడు యూఎఫ్‌వోలు వచ్చి భూమిని సందర్శించి వెళ్తుంటాయని చెబుతుంటారు. కొన్ని దశాబ్దాల క్రితం ఆకాశంలో గ్రహాంతరవాసులు పదే పదే కనపడేవని అమెరికాకు చెందిన పలువురు చెప్పారు. యూఎఫ్‌వోల గురించి యూఏపీ స్వతంత్ర అధ్యయన బృందం శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన చేసి.. రిపోర్ట్ రెడీ చేసింది. యూఎఫ్‌వోల గురించి వీలైనంత క్షుణ్ణంగా ఆ టీమ్ అధ్యయనం చేసింది.
Read Also: Health Tips : పచ్చి కొబ్బరిని ఇలా తీసుకుంటే ఎన్ని లాభాలో.. ఆ సమస్యలు జన్మలో రావు..
యూఎఫ్‌వోల గుట్టును ఈ బృందం విప్పినట్లుగా ప్రచారం కొనసాగుతుంది. యూఎఫ్‌వోలకు సంబంధించిన గ్రహాంతర వాసులు ఉన్నారన్న ఆధారాలు ఏం లేవని చెప్పింది. అయితే, ఈ బృందంలో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. వాషింగ్టన్ లోని నాసా ప్రధాన కార్యాలయం నుంచి నివేదికను విడుదల చేసింది. యూఎఫ్‌వోలపై హై-క్వాలిటీతో అధ్యయనాలు జరిగినప్పటికీ, ఇప్పటివరకు శాస్త్రీయంగా ఆ అధ్యయనాలకు తుది రూపు ఇచ్చిన వారు లేరని నాసా వెల్లడించింది. గ్రహాంతరవాసులపై తాము చేసిన శాస్త్రీయ పరిశోధనలు భవిష్యత్తులో చేయబోయే వాటి గురించి ఈ రిపోర్ట్ ఓ కచ్చితమైన దారి చూపుతుందని నాసా ప్రకటించింది.