NTV Telugu Site icon

Sunitha Williams: వెల్ కమ్ బ్యాక్ సునీత.. భూమిపైకి తిరిగొచ్చిన నాసా వ్యోమగాములు

Sunita

Sunita

ప్రపంచమంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సుధీర్ఘ విరామానికి తెరపడింది. భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చింది. బుచ్ విల్మోర్ కూడా ఆమెతో తిరిగి వచ్చాడు. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు క్యాప్సూల్స్ ఫ్లోరిడా తీరంలో విజయవంతంగా ల్యాండింగ్ అయ్యింది. ఇద్దరు వ్యోమగాములతో స్పేస్‌ఎక్స్ క్రూ-9 భూమికి తిరిగి వచ్చింది. అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి రావడానికి 17 గంటలు పట్టింది. క్యాప్సుల్స్ సముద్ర జలాల్లో సురక్షితంగా దిగింది. నాసా సిబ్బంది అక్కడికి చేరుకుని బోట్ల సాయంతో నౌకపైకి తెచ్చి ఒడ్డుకు చేర్చారు.

Also Read:Betting Apps Case: తెలుగు రాష్ట్రాలను షేక్‌ చేస్తోన్న బెట్టింగ్ యాప్స్.. వణికిపోతోన్న సెలబ్రిటీలు..!

వ్యోమగాములను హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కు తరలించనున్నారు. ఈ ఇద్దరు నాసా వ్యోమగాములు కేవలం ఎనిమిది రోజుల పర్యటనక కోసం వెళ్లారు. కానీ స్టార్ లైనర్ లో సాంకేతిక లోపం కారణంగా, ఇద్దరూ తొమ్మిది నెలల 14 రోజులు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. క్రూ-9 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 10:35 గంటలకు బయలుదేరింది. అంతర్జాతీయ స్టేషన్‌లో ఉన్న వ్యోమగాములు తుది వీడ్కోలు పలికారు. అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్ష నౌక విడిపోతున్న వీడియోను నాసా షేర్ చేసింది.