NTV Telugu Site icon

NASA: చంద్రయాన్-3 విజయంపై నాసా చీఫ్ ప్రశంసలు

Chandrayan

Chandrayan

ఇస్రో ప్రవేశపెట్టిన చంద్రయాన్ -3 మిషన్ విజయవంతం కావడంతో నాసా చీఫ్ బిల్ నెల్సన్ ప్రశంసించారు. ఏ దేశం చేయని పనిని భారత్‌ చేసింది.. అందుకే ఈ ఘనత సాధించినందుకు అందరి ప్రశంసలు దక్కుతాయని ఆయన అన్నారు. భారతదేశానికి నా అభినందనలు.. చంద్రుని దక్షిణ ధృవం చుట్టూ ల్యాండ్ అయిన మొదటి ప్రయోగం మీదేనని చెప్పుకొచ్చారు.

Read Also: Hyper Aadi: రాత్రి పది తర్వాత సుధీర్ ఇలాంటి పనులు చేస్తాడా?.. సుధీర్ గుట్టు రట్టు చేసిన ఆది..

నిసార్ (NISAR) మిషన్ గురించి కూడా బిల్ నెల్సన్ ప్రస్తావించారు. ఇది భూమిపై ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి పూర్తి త్రిడీ మిశ్రమ నమూనాను చూపిస్తుందన్నారు.. దీనికి నాలుగు ప్రధాన అబ్జర్వేటరీలు ఉన్నాయి.. తాము ఇప్పటికే కక్ష్యలో ఉన్న 25 స్పేస్‌క్రాఫ్ట్‌లతో నాలుగింటిని పైకి తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. ఈ అబ్జర్వేటరీలలో నిసార్ మొదటిది.. ఇది భూమి యొక్క అన్ని ఉపరితలాలను గమనిస్తుంది.. నీరు, భూమి, మంచులో ఏవైనా వచ్చాయా అనే మార్పులను గమనిస్తుంది.. ఇది మనం అర్థం చేసుకోవడానికి సహాయపడే మరొక డేటా అని నెల్సన్ తెలిపారు. ఈ మిషన్ వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రవేశపెట్టబోతున్నాం.. ఈ రాకెట్‌ను ఇండియన్ స్పేస్ ఏజెన్సీ అందించింది.. దీని కోసం మేము అంతరిక్ష నౌకను నిర్మించాము.. ఇదీ బెంగళూరులోని ఇస్రో సెష్టన్ లో అభివృద్ధి చేస్తున్నారు అని నాసా చీఫ్ వెల్లడించారు.

Read Also: Prashanth Neel: KGF వల్లే సలార్ డిలే… షాకింగ్ సీక్రెట్స్ బయటపెట్టిన నీల్!

నిసార్, నాసా, ఇస్రో మధ్య ఉమ్మడి భూమి-పరిశీలన మిషన్, భూమి యొక్క అటవీ, చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థలలో మార్పులు ప్రపంచ కార్బన్ చక్రం, వాతావరణ మార్పులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో అన్వేషించడానికి పరిశోధనలు సహాయం చేస్తాయని నాసా చీఫ్ నెల్సన్ తెలిపారు. నిసార్ అనేది నాసా, ఇస్రో యొక్క ఉమ్మడి మిషన్ తో పాటు కక్ష్యలో ఉన్నప్పుడు దాని అధునాతన రాడార్ వ్యవస్థలు దాదాపు భూమి యొక్క అన్ని ఉపరితలాలను ప్రతి 12 రోజులకు రెండుసార్లు స్కాన్ చేస్తాయని ఆయన చెప్పుకొచ్చారు.