Jani Master : జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master : ఇటీవల కాలంలో జానీ మాస్టర్ వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఈ వివాదం జాతీయ అవార్డు రద్దు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. తనను లైగింక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కావడంతో 2022కుగాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఆయన అందుకోవాల్సిన జాతీయ అవార్డును కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కావడానికి ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సిటీ కోర్టును పోలీసులు ఆశ్రయించారు.
Read Also:Nithilan Saminathan : హిట్టు కొట్టాడు.. BMW కార్ పట్టాడు..
Also Read
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
2022లో తిరుచిత్రబలం(తెలుగులో తిరు) చిత్రానికిగాను జాని మాస్టర్‌కు ప్రభుత్వం ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును ప్రకటించింది. అయితే పోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఆ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది. అలాగే ఈ నెల 8న న్యూఢిల్లీలో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ అవార్డుల ఫంక్షన్‌కు హాజరవ్వడానికి తనకు బెయిల్ ఇవ్వాలంటూ జానీ మాస్టర్ చేసిన విజ్ఞప్తిని గురువారం సిటీ కోర్టు అంగీకరించింది. ఆయనకు ఈ నెల 6 నుంచి 9 వరకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కాగా ఇప్పుడు నార్సింగి పోలీసులు బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో జానీ మాస్టర్ ఏం జరుగుతుందో చూడాలి.
Read Also:Chennai Air Show: చెన్నైలో ఎయిర్ షో వివాదం.. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం..!
తాజావార్తలు
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!