NTV Telugu Site icon

Jani Master : జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన పోలీసులు

Jani Master

Jani Master

Jani Master : ఇటీవల కాలంలో జానీ మాస్టర్ వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. ఈ వివాదం జాతీయ అవార్డు రద్దు వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్‌కు మరో షాక్‌ తగిలింది. మధ్యంతర బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. తనను లైగింక వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కావడంతో 2022కుగాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా ఆయన అందుకోవాల్సిన జాతీయ అవార్డును కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కావడానికి ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సిటీ కోర్టును పోలీసులు ఆశ్రయించారు.

Read Also:Nithilan Saminathan : హిట్టు కొట్టాడు.. BMW కార్ పట్టాడు..

2022లో తిరుచిత్రబలం(తెలుగులో తిరు) చిత్రానికిగాను జాని మాస్టర్‌కు ప్రభుత్వం ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డును ప్రకటించింది. అయితే పోక్సో చట్టం కింద వచ్చిన తీవ్ర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని ఆ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జాతీయ అవార్డుల కమిటీ ప్రకటించింది. అలాగే ఈ నెల 8న న్యూఢిల్లీలో జరిగే 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం కోసం ఆయనకు పంపిన ఆహ్వానాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. ఈ అవార్డుల ఫంక్షన్‌కు హాజరవ్వడానికి తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ జానీ మాస్టర్‌ చేసిన విజ్ఞప్తిని గురువారం సిటీ కోర్టు అంగీకరించింది. ఆయనకు ఈ నెల 6 నుంచి 9 వరకు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ఇప్పుడు నార్సింగి పోలీసులు బెయిల్ రద్దు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో జానీ మాస్టర్ ఏం జరుగుతుందో చూడాలి.

Read Also:Chennai Air Show: చెన్నైలో ఎయిర్ షో వివాదం.. అధికార- విపక్షాల మధ్య మాటల యుద్ధం..!

Show comments