Naresh: ఉదయం నుంచి నరేష్- పవిత్ర పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కొంతమంది ఆ వీడియో ఇప్పటిది కాదని, సినిమా షూటింగ్ కోసం చేసిన వీడియోను పోస్ట్ చేసినట్లు చెప్పుకొస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా పెళ్లి తరువాతఈ జంట హనీమూన్ కోసం దుబాయ్ వెళ్లినట్లు చెప్పుకొస్తున్నారు. అసలు నరేష్ పెళ్లి చేసుకున్నాడా..? లేదా అనేది మాత్రం మిస్టరీగానే మారింది. ఇక ఇంకొంతమంది ఈ పెళ్లి అంతా ప్రమోషన్ స్టంట్ అంటూ చెప్పుకొస్తున్నారు. అందుకుకారణం కూడా లేకపోలేదు. నరేష్ నటించిన ఇంటింటి రామాయణం అనే వెబ్ సిరీస్ త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతోంది. దానికి హైప్ తెప్పించడానికి నరేష్ ఇలాంటి పని చేశాడని చెప్పుకొస్తున్నారు.
NTR: నటుడిగా కాదు ఒక భారతీయుడిగా రెడ్ కార్పెట్ పై నడుస్తా
ఇక ఇదే విషయం అడగడానికి మీడియా నరేష్ వెంటపడింది. మ్యారేజ్ నిజంగా అయ్యిందా లేదా అంటూ నరేష్ అడగడానికి అతడు ఉన్న చోటుకు వెళ్లగా.. ఆయన మీడియాను చూసి ఒక్కసారిగా ఆగకుండా కారు వద్దకు వెళ్ళిపోయాడు. ” నాకు ప్రైవసీ కావాలి.. నా పెళ్లి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి అని విషయాలు చెప్తాను. అప్పటివరకు ఓపిక పట్టండి” అంటూ చెప్పుకురావడం గమనార్హం. ప్రస్తుతం నరేష్ వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు నీ పెళ్లి ఏంటో.. ఏమో.. జరగడమే పెద్ద గొప్ప అంటుంటే.. మళ్లీ నువ్వు దాన్ని ప్రమోషన్స్ కింద వాడుకోవడం ఒకటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆ ప్రెస్ మీట్ ఎప్పుడు ఉంటుందో.. అందులో నరేష్ ఏం చెప్తాడో చూడాలి.