Site icon NTV Telugu

Naresh: నరేష్ 3.0 వెర్షన్ చూస్తారు.. మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటి?

Naresh

Naresh

శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ సినిమాపై ధీమా వ్యక్తం చేశారు. ‘సామజవరగమన’ తో తనలో 2.0 వెర్షన్ చూశారని, ఈ సినిమాతో ‘నరేష్ 3.0’ వెర్షన్ చూస్తారని ఆయన పేర్కొన్నారు. థియేటర్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి సినిమా ముగిసే వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని, తన కెరీర్‌లో ఇది ఒక బెస్ట్ రోల్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా కచ్చితంగా ‘గన్ షాట్’ హిట్ అవుతుందని నరేష్ జోస్యం చెప్పారు. అలాగే ఇక సినిమాలో తన పాత్రకు రెండో పెళ్లి జరగడం, దీనిపై వస్తున్న జోక్స్ గురించి నరేష్ తనదైన శైలిలో స్పందించారు.

Also Read : Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటిటి + టీవీ హక్కులు అప్డేట్

సినిమాలో తన క్యారెక్టర్ మీద వేసుకున్న జోక్స్ గురించి మాట్లాడుతూ… ‘సినిమాలో నా పాత్రకు మళ్లీ పెళ్లి అవుతుంది, దానివల్ల వచ్చే ఫన్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ కాలంలో ఎంతమంది మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదు?’ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.అలాగే ఈ తరం దర్శకుల్లో రామ్ అబ్బరాజు టీమ్.. కామెడీ సినిమాలకు ఒక వరమని, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లాగే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని నరేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version